/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-11-1-jpg.webp)
Bhuma Mounika Emotional Post: టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ (Manchu Manoj), రాజకీయ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక గతేడాది ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ప్రేమించుకున్న వీరిద్దరూ 2023 లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. మౌనికకు అప్పటికే ధైరవ్ (Dhairav) అనే కుమారుడు ఉన్నాడు. భార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న మనోజ్.. ధైరవ్ ను కూడా సొంత కొడుకులా చూసుకుంటున్నారు. అయితే నేడు మౌనిక, మనోజ్ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. ఈ సందర్భంగా.. సోషల్ మీడియా వేదికగా భర్త మనోజ్ కు బ్యూటిఫుల్ విషెస్ తెలియజేసింది భూమా మౌనిక.
Also Read: Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చతార్థం.. వైరలవుతున్న ఫొటోలు
భూమా మౌనిక ఇన్స్టా గ్రామ్ పోస్ట్
"హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై హస్బెండ్. నా జీవితం మొదలైనప్పటి నుంచి.. నువ్వు నాకు తెలుసనిపిస్తుంది. మనిద్దరి మధ్య అన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు, ధైరవ్ కు నీ హృదయంలో చోటిచ్చినందుకు థ్యాంక్స్.. ఇలాంటి ఫ్రెండ్షిప్, క్రేజీషిప్, పార్ట్నర్షిప్, అందించిన యూనివర్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇవ్వన్నీ నాకు ప్రేమ పై మళ్ళీ నమ్మకం కలిగేలా చేశాయి. ప్రేమ, ఆప్యాయతలతో ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మార్చుకుందాము. పెళ్లి రోజు శుభాకాంక్షలు ది లవ్ ఆఫ్ మై లైఫ్ ( మంచు మనోజ్). నా హృదయంలో.. నీకు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది అంటూ ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది మౌనిక."
Also Read: Varalaxmi Sarathkumar: నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నిశ్చతార్థం.. వైరలవుతున్న ఫొటోలు
View this post on Instagram
Vijay Devarakonda, Pooja Hegde: ఫ్యామిలీ స్టార్ పాటకు స్టెప్పులేసిన పూజ, విజయ్.. వైరలవుతున్న వీడియో