/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T123004.443.jpg)
Manamey Movie Pre Release Event Venue : టాలీవుడ్ (Tollywood) యంగ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) హీరోగా శ్రీరామ్ ఆదిత్య (Sriram Aditya) దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'మనమే' (Manamey). పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. యంగ్ బ్యూటీ కృతి శెట్టి (Kriti Shetty) ఫీమేల్ లీడ్ లో నటించగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఇటీవల ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పిఠాపురం (Pithapuram) లో జరపనున్నారనే టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు నిజం కాదని చెబుతూ మేకర్స్ తాజాగా కొత్త వేదికను అనౌన్స్ చేశారు.
Also Read : పవన్ కళ్యాణ్ కు తమిళ స్టార్ అభినందనలు.. వైరల్ అవుతున్న ట్వీట్!
పిఠాపురంలో కాదు...
మనమే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. ఇక ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరు కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు.
Today is the day to celebrate the 𝑩𝑰𝑮𝑮𝑬𝑺𝑻 𝑬𝑵𝑻𝑬𝑹𝑻𝑨𝑰𝑵𝑴𝑬𝑵𝑻 FEST🤩
Join us for the Grand Pre-Release Event of #Manamey will be held Today @ 6 PM🤘🏻
📍Park Hyatt, HYD
Book your free 🎟️ at https://t.co/GzTqe2Tuao@ImSharwanand @IamKrithiShetty @SriramAdittya… pic.twitter.com/SSk2lQMi0Y
— People Media Factory (@peoplemediafcy) June 5, 2024