Anger Control : ట్రిగ్గర్ చేస్తే రెచ్చిపోవద్దు.. సచిన్, ద్రవిడ్‌ని చూసి నేర్చుకోండి..! ట్రిగ్గర్ చేసినప్పుడు రెచ్చిపోకుండా కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకోండి. అందుకోసం లోతైన శ్వాస తీసుకోండి, 10 వరకు లెక్కించండి, హాస్యాన్ని ఉపయోగించండి. ఇక క్రికెట్‌లో సచిన్, ద్రవిడ్ ట్రిక్‌ను ప్లేక్ చేయండి. వారేం చేసేవారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. By Trinath 22 Dec 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Sachin and Dravid : కొంతమంది ఇతరులను పనీపాటా లేకుండా ట్రిగ్గర్(Trigger) చేస్తుంటారు. మన వాడుక భాషలో చెప్పుకోవాలనుకుంటే పనిగట్టుకోని మరీ కెలుకుతుంటారు. ఇది వాళ్ల నైజం. వాళ్లు ట్రిగ్గర్ చేశారు కదా అని రెచ్చిపోతే మనకే నష్టం. ట్రిగ్గర్ చేసినప్పుడు ఆవేశంతో ఊగిపోతే మన ఆరోగ్యమే పాడవుతుంది. కవ్వించినా, కెలికినా కోపం తెచ్చుకోకుండా అవతలి వాళ్ల మూతి మూయించడం ఒక ఆర్ట్. ఇది అందరు తెలుసుకోవాలి. ఎగ్జాంపూల్‌కి మన ఇండియాలో మతంగా భావించే క్రికెట్(Cricket) నే తీసుకుందాం. క్రికెట్‌లో సచిన్(Sachin), ద్రవిడ్(Dravid) ఎంతో పేరు తెచ్చుకున్నారు. సచిన్‌ని గాడ్ అని, ద్రవిడ్‌ని వాల్ అని పిలుస్తుంటారు. అయితే ఈ బిరుదులు వారికి కేవలం ఆట వల్లే వచ్చినవి కావు. క్రికెట్‌లో ఈ ఇద్దరిని అందరికంటే ఎక్కువగా గౌరవించడానికి వారి ఆటతో పాటు ప్రవర్తనే ప్రధాన కారణం. ఈ ఇద్దరి దగ్గర నుంచి ఎన్నో జీవిత విషయాలు నేర్చుకోవచ్చు. తోటి మనుషులు ట్రిగ్గర్ చేస్తే ఎలా నడుచుకోవాలో.. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా సచిన్, ద్రవిడ్‌ను చూసి తెలుసుకోవచ్చు. నవ్వండి.. కామ్‌గా ఉండండి.. ఆవేశపడొద్దు: సచిన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఆటగాళ్లు కవ్వించేవాళ్లు. మైండ్‌ని డైవర్ట్ చేయడానికి , డిస్ట్రాక్ట్ చేయడానికి కెలికేవారు. అయితే సచిన్ అవేవి పట్టించుకునేవాడు కాదు. స్లెడ్జ్ చేస్తున్నంత సేపు అసలు గ్రౌండ్‌లో ఏం జరగనట్టే బిహేవ్ చేసేవాడు. టైమ్ చూసి బాల్‌ని బౌండరీకి తరలించేవాడు. గంటకు 150కిలోమీటర్లకు పైగా వేగంతో బంతి వేస్తే దాన్ని అలవోకగా బౌండరీ దాటించేవాడు. దీంతో బౌలర్లు మూతి మూసుకోని బౌలింగ్ చేయాల్సి వచ్చేది. అటు టెస్టుల్లో ద్రవిడ్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యేవాడు. అయితే సచిన్ బౌండరీ కొట్టి ప్రత్యర్థుల నోర్లను సైలెంట్ చేస్తే.. ద్రవిడ్ డిఫెన్స్ ఆడి బౌలర్లను, ఫీల్డర్లను చికాకు పెట్టేవాడు. షోయబ్‌అక్తర్ ఒకసారి ద్రవిడ్‌ని స్లెడ్జ్ చేశాడు. దీంతో ద్రవిడ్ రెచ్చిపోతాడని.. ఆఫ్ స్టంప్ బయట వెళ్తున్న బాల్‌ని టచ్ చేసి క్యాచ్ ఇస్తాడని అతను భావించాడు. సాధారణంగానే గంటలకు 150 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసే అక్తర్.. అప్పుడు ఏకంగా బౌండరీ రోప్ నుంచి పరిగెత్తుకోని వచ్చి బాల్ విసిరాడు. ద్రవిడ్ అసలు తనకేమీ పట్టన్నట్టు బాల్‌ని లీవ్ చేశాడు.. వెంటనే అక్తర్ ఆయసంలో రొప్పాడు కానీ ద్రవిడ్ అసలు ఏం జరగనట్టే నిలబడ్డాడు. ఇలా మనల్ని ట్రిగ్గర్ చేసేవారికి సైలెంట్‌గా వర్క్‌తోనే సమాధానం చెప్పాలి. ట్రిగ్గర్ చేశారు కదా అని ఆవేశంతో బ్యాట్ ఊపితే క్లీన్ బౌల్డ్ అవుతారు. ట్రిగ్గర్ చేసినప్పుడు కోపాన్ని ఇలా కంట్రోల్ చేసుకోండి: --> లోతైన శ్వాస తీసుకోండి. --> 10 వరకు లెక్కించండి. --> నిశ్చింతగా వ్యక్తపరచండి. --> సానుభూతిని పాటించండి. --> హాస్యాన్ని ఉపయోగించండి. --> పరిష్కారాలపై దృష్టి పెట్టండి. Also Read: ఫ్యాన్స్‌లో టెన్షన్.. దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు కోహ్లీ రిటర్న్.. ఎందుకంటే? WATCH: #sachin-tendulkar #health-tips #life-style #rahul-dravid #sachin-v-s-dravid #trigger మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి