Watch Video: రీల్స్‌ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఓ యువకుడు ఏకంగా తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించి రీల్‌ గురించి సెంట్రల్‌ రైల్వే.. ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ వైరలవుతోంది. ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం మానుకోవాలంటూ రైల్వేశాఖ కోరింది.

New Update
Watch Video: రీల్స్‌ మోజులో పడి చేయి, కాలు పోగొట్టుకున్న యువకుడు

సోషల్‌ మీడియాలో పాపులారిటీ కోసం కొంతమంది ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రోడ్లపై, రైలు పట్టాలపై రీల్స్‌ చేస్తూ కొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా ఓ యువకుడు రీల్స్ మోజులో పడి ఏకంగా తన కాలు, చేయిని పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించి రీల్‌ గురించి సెంట్రల్‌ రైల్వే.. ఎక్స్‌లో చేసిన పోస్ట్‌ వైరలవుతోంది. ప్రయాణికులు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేయడం మానుకోవాలంటూ రైల్వేశాఖ సూచనలు చేసింది.

Also Read: కాల్ గర్ల్స్, రేప్ కేసు, డ్రగ్స్ బానిసలే టార్గెట్.. అందినంత దోచేస్తున్న ఫేక్ పోలీస్!

ఇక వివరాల్లోకి వెళ్తే.. మస్జిత్ షా అనే యువకుడు కదులుతున్న రైలును రెండు చేతులతో పట్టుకొని స్టంట్ చేశాడు. అలా చేస్తూ ఉండగానే ప్రమాదవశాత్తు ఒక కాలు, చేయి పొగొట్టుకున్నాడు. రీల్స్ చేస్తూ తాను ఇలా కాలు, చేయి పోగొట్టుకున్నానని తెలుపుతూ ఆ యువకుడు చెప్పిన వీడియోను సెంట్రల్ రైల్వే తన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేసింది. అయితే అంతకుముందు ఆ యువకుడు ఇలా స్టంట్ చేసిన వీడియో వైరల్ అవ్వడంతో రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లగా.. అలా ఒక కాలు, చేయి కోల్పోయిన స్థితిలో కనిపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ఏప్రిల్ 14న రైల్వే స్టేషన్‌లో ఇలా రీల్స్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కాలు, చెయి కోల్పోయినట్లు ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలాఉండగా.. ఎవరైనా రైళ్లు, రై ల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఇటువంటి స్టంట్లు చేస్తే వెంటనే 9004410735 లేదా 139 నంబర్‌కు సంప్రదించాలని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ స్వప్నిల్ తెలిపారు.

Also read: సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నారా ? ఫ్రీ కోచింగ్, ఫ్రీ హాస్టల్‌.. ఎక్కడంటే

#telugu-news #social-media #reels
Advertisment
Advertisment
తాజా కథనాలు