Maharashtra: మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి.. ఎందుకంటే..?

తమకు నచ్చని రాజకీయ నాయకులపై కోడి గుడ్లు, టమాలు, చెప్పులు విసరడం.. ఇంకు చెల్లడం వంటివి చూసే ఉంటాం. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా.. నచ్చింది మాట్లాడకపోయినా ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉంటారు. కానీ మహారాష్ట్రలో మాత్రం మంత్రిపై ఓ యువకుడు పసుపు చల్లి తన నిరసన వ్యక్తంచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Maharashtra: మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి.. ఎందుకంటే..?

Maharashtra: తమకు నచ్చని రాజకీయ నాయకులపై కోడి గుడ్లు, టమాలు, చెప్పులు విసరడం.. ఇంకు చెల్లడం వంటివి చూసే ఉంటాం. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా.. నచ్చింది మాట్లాడకపోయినా ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉంటారు. కానీ మహారాష్ట్రలో మాత్రం మంత్రిపై ఓ యువకుడు పసుపు చల్లి తన నిరసన వ్యక్తంచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే..?

మహారాష్ట్రకు చెందిన రెవెన్యూశాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్.. షోలాపూర్ జిల్లాలోని ప్రభుత్వ విశ్రాంతి గృహానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. మంత్రి వాటిని చదువుతుండగానే ఓ యువకుడు తన జేబులో నుంచి పసుపు తీసి మంత్రి పాటిల్ తపై చల్లాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి గన్‌మెన్స్, సిబ్బంది ఆ వ్యక్తిపై దాడి చేశారు. అయితే మంత్రి అతడిని వదిలివేయమనడంతో పక్కకు తీసుకెళ్లారు.

పసుపు చల్లిన వ్యక్తి పేరు శేఖర్ బంగాలేగా పోలీసులు గుర్తించారు. తమ వర్గానికి చెందిన ప్రజల ఇబ్బందులపైకి ప్రభుత్వం దృష్టిని మళ్లించడానికే ఇలా చేశానని.. ఎస్టీ విభాగంలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి రాధాకృష్ణ మాట్లాడుతూ తనపై పసుపు చల్లినందుకు తానేం బాధపడడం లేదన్నారు. పసుపు సంతోషానికి గుర్తు అని.. అందులో తనకు ఏ తప్పూ కనిపించలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పసుపు చల్లిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని పోలీసులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే అర్హతలేంటో తెలుసా? వివరాలు మీకోసం..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chandola Lake Demolition : 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!

చందోలా సరస్సు ప్రాంతంలో ఆక్రమణలుగా భావించిన 8,500 నిర్మాణాల కూల్చివేతను ఒకే రోజు పూర్తి చేసి, 2.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని స్వాధీనం చేసుకుంది అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఈ ఆపరేషన్ లో 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు పాల్గొన్నారు.

New Update
Chandola lake demolition

హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా వెళ్తే  ఎలా ఉంటుందో అందరం చూసి ఉంటాం.  అంతకు మంచి  పదిరేట్ల  యాక్షన్ జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి..  అవును ఇలాంటిది గుజరాత్ లో జరిగింది.  ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  50 బుల్డోజర్లు దండయాత్రకు బయలుదేరాయి. ఆక్రమణలను నిమిషాల వ్యవధిలోనే చూస్తుండగానే కూల్చివేశాయి.అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC)  అధికారులు మంగళవారం నాడు దానిలిమ్డాలోని చందోలా సరస్సును అక్రమంచ కట్టిన ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. 

8 వేల 500 ఇళ్లు కూల్చివేత 

ఒక్కరోజే ఏకంగా 8 వేల 500 ఇళ్లను కూల్చివేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింంది.  దీని ద్వారా అధికారులు  మొత్తం 2 లక్షల 50 వేల చదరపు మీటర్ల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.  ఇందులో 350 మంది సిబ్బంది పాల్గొని  మంగళవారం ఉదయం 7 గంటలకు పని ప్రారంభించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు 35 బుల్డోజర్లు, 15 మట్టిని తొలగించే యంత్రాలను మోహరించారు. కూల్చివేత సమయంలో శాంతిభద్రతలను కాపాడటానికి 3,000 మందికి పైగా పోలీసులు, రాష్ట్ర రిజర్వ్ పోలీసు (SRP) సిబ్బందిని మోహరించారు.  

చందోలా సరస్సు వద్ద అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం మున్సిపల్ కార్పొరేషన్ , నగర పోలీసులు ఏప్రిల్ 29 నుండి మే 1 వరకు మూడు రోజుల ఆపరేషన్ నిర్వహించారు, మొదటి దశలో కూల్చివేత జరిగింది. మొదటి రోజు ఫామ్‌హౌస్‌లు, గిడ్డంగులు , తాత్కాలిక నివాసాలతో సహా 1 లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని తొలగించారు. రెండవ రోజు 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు జరిగింది. చివరి రోజు ఘోడాసర్ సమీపంలోని 25 దుకాణాలు, సరస్సులోని వివిధ కట్టల పక్కన 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక పెద్ద గిడ్డంగితో సహా వాణిజ్య సంస్థలపై దృష్టి సారించింది. దాదాపు 99.9 శాతం ఆక్రమణలను కూల్చివేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.  కేవలం కొన్ని మతపరమైన కట్టడాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. 2010 కి ముందు నుంచి ఇక్కడ నివసిస్తున్న వారికి వసతి కల్పిస్తామని.. ఆ తర్వాత వచ్చిన వారు వెళ్లిపోవాల్సిందేనని గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. 

 

Advertisment
Advertisment
Advertisment