Amazon : అయ్యో.. హెడ్‌ఫోన్స్‌ ఆర్డర్‌ చేస్తే.. టూత్‌పేస్ట్ డెలివరీ అయ్యింది..

అమెజాన్‌లో సోనీ హెడ్‌ఫోన్స్ ఆర్టర్‌ చేసిన ఓ వ్యక్తికి.. దానికి బదులుగా కోల్‌గేట్ టూత్‌పేస్ట్ డెలివరీ అయ్యింది. దీన్ని చూసిన కంగుతిన్న అతడు.. తనకు జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీనిపై స్పందించిన అమెజాన్ ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.

Amazon : అయ్యో.. హెడ్‌ఫోన్స్‌ ఆర్డర్‌ చేస్తే.. టూత్‌పేస్ట్ డెలివరీ అయ్యింది..
New Update

Customer Shocked : ఈమధ్య చాలామంది తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కునేందుకు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్నిసార్లు ఒక వస్తువు ఆర్టర్‌ చేస్తే.. దానికి బదులు మరో వస్తువు వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతడు ఖరీదైన సోనీ హెడ్‌ఫోన్స్‌ను ఆర్డర్ చేస్తే.. దానికి బదులుగా కోల్‌గేట్‌ టూత్‌పేస్ట్ డెలివరీ అయ్యింది. దీన్ని చూసి అతడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఓజాహ్ అనే వ్యక్తి ట్విట్ట్‌లో ఓ వీడియోను చేశాడు. 'అమెజాన్‌లో ‘సోనీ XB910N వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను రూ.19,900లకి ఆర్డర్ చేశాను. దానికి బదులు కోల్‌గేట్‌ టూత్‌ పెస్ట్ వచ్చిందంటూ' రాసుకొచ్చాడు. అయితే ఈ వీడియోపై అమెజాన్ సంస్థ కూడా స్పందించింది. ఇలా జరిగినందుకు అతనికి క్షమాపణలు కూడా చెప్పింది. ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించి పలు వివరాలు అందించాలని కోరింది.

Also Read: సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 రద్దును సమర్ధించింది.. అసలు ఈ ఆర్టికల్ ఏమిటో తెలుసా?

ఇదిలాఉండగా.. ఇటీవలే ఆర్యన్ అనే మరో కస్టమర్ రూ.లక్ష విలువ చేసే సోనీ టీవీని ఫ్లిప్‌కార్డ్‌ ద్వారా ఆర్డర్ చేశాడు. అయితే దానికి బదులుగా థామ్సన్ అనే మరో టీవీ డెలివరీ అయ్యింది. మరోవ్యక్తి కూడా ఫ్లిప్‌కార్డ్ నుంటి కిచెన్‌ చిమ్నీని ఆర్టర్ చేస్తే.. ఓ డ్యామెజ్‌ అయిపోయిన వస్తువు డెలివరీ అయ్యింది. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి.

Also read: పార్టీ మార్పుపై గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన ప్రకటన

#telugu-news #amazon #delivery
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe