Haryana: : గత కొంత కాలంగా తమతో సహజీవనం చేస్తున్న వారిని చిన్న చిన్న కారణాలకే తమతో కలిసున్నవారే చంపేస్తున్నారు. తాజాగా హర్యానాలోని గురుగ్రామ్ లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి కోడి గుడ్డు కూర వండి పెట్టడానికి నిరాకరించినందుకు హత్య చేశాడు ఓ వ్యక్తి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురగ్రామ్ లోని నిర్మాణంలో ఉన్న ఓ ఇంట్లో మహిళా మృతదేహన్ని(Dead Body) పోలీసులు కనుగొన్నారు. ఈ ఘటన చౌమా గ్రామంలో జరిగినట్లు సమాచారం. ఈ కేసులో 35 ఏళ్ల లల్లన్ యాదవ్‌ను పోలీసులు నిందితుడిగా గుర్తించారు. అతను బీహార్‌లోని మాధేపురా జిల్లాలోని ఔరాహి గ్రామ నివాసి. అతని భార్య 6 సంవత్సరాల క్రితం చనిపోయింది.
ఆ తరువాత అతడు అక్కడ నుంచి పని కోసం ఢిల్లీకి వచ్చాడు. అక్కడ చెత్తను సేకరించే అంజలి అనే యువతితో సహజీవనం చేయడం ప్రారంభించాడు. శుక్రవారం రాత్రి నిందితుడు ఫుల్లుగా తాగి వచ్చి అంజలిని కోడిగుడ్డు(Egg Curry) కూడా వండమని అడిగాడు. దానికి అంజలి నిరాకరించింది. కోపంతో ఊగిపోయిన లల్లన్ యాదవ్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. అక్కడితో ఆగకుండా బెల్ట్, సుత్తితో తీవ్రంగా కొట్టాడు.
దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆ తరువాత నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడు. సెక్యూరిటీ గార్డు ముందుగా అంజలి మృతదేహాన్ని చూశాడు. అతను పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
లల్లన్ యాదవ్, అంజలి ఆ భవనానికి వారం రోజుల క్రితమే వచ్చినట్లు సెక్యూరిటీ గార్డు చెబుతున్నాడు. నిందితుడు మృతురాలిని భార్య గా చెప్పడంతో ఎవరికీ అనుమానం రాలేదని అతను వివరించాడు. సుమారు 7 నెలల క్రితం లల్లన్ యాదవ్ చెత్త సేకరించే అంజలిని కలిశాడని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇద్దరూ పని చేసుకుంటూ సహజీవనం చేయడం ప్రారంభించారు.
పాలెం విహార్ ఏసీపీ నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. అంజలిని హత్య చేసి లల్లన్ పరారీలో ఉన్నాడు. హత్యకు ఉపయోగించిన సుత్తి, బెల్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వివరించారు.