King Cobra: పాముతో భయంకరమైన సాహసం.. వీడియో చూస్తే దడుసుకుంటారు!

ఎలాంటి సేఫ్టీ లేకుండా భారీ కింగ్ కోబ్రాను చేతపట్టుకుని ఓ వ్యక్తి విషం తీసిన తీరు జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. నిగ్ ది రాంగ్లర్ అనే సోషల్ మీడియా యూజర్ వైరల్ కావడం కోసం ఈ చర్యకు పాల్పడగా జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. మూగ జీవుల పట్ల నైతిక విలువలు పాటించాలని సూచిస్తున్నారు.

King Cobra: పాముతో భయంకరమైన సాహసం.. వీడియో చూస్తే దడుసుకుంటారు!
New Update

VIRAL VIDEO: ఓ సోషల్ మీడియా యూజర్ భయంకరమైన స్టంట్ తో జనాలకు పిచ్చెక్కించాడు. భారీ కింగ్ కోబ్రాను చేతితో పట్టుకుని ఓ వ్యక్తి నిర్భయంగా దాని విషాన్ని వెలికితీశాడు. అంతేకాదు ఒళ్లు గగుర్పొడిచే తతంగాన్ని వీడియో తీసి స్వయంగా నెట్టింట షేర్ చేయగా జనాలు ఉలిక్కిపడ్డారు. ఒక రోజు వ్యవధిలోనే 7 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన వీడియోపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగుతోంది.

సెఫ్టీ వాడకుండానే..
ఈ మేరకు నిక్ ది రాంగ్లర్ (@nickthewrangler) అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారుడు సాహసోపేతమైన చర్యకు పాల్పడ్డాడు. నిర్భయంగా తన ఒట్టి చేతులతో ఒక భారీ కింగ్ కోబ్రాను పట్టుకుని, దాని విషాన్ని గాజు సీసాలోకి ఎక్కించాడు. అయితే ఇందుకోసం అతను ఏ విధమైన సెఫ్టీ వాడకపోవడం జనాలకు ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు ఈ వీడియోకు 'కింగ్ గిడియాన్ నుంచి విషాన్ని స్వీకరించడం. కింగ్ కోబ్రాస్ ప్రపంచంలోని 3వ అత్యంత విషపూరితమైన పాము. దీని విషం మందపాటి బంగారు పసుపు రంగులో ఉంది. ఇది ఒక శక్తివంతమైన న్యూరోటాక్సిన్. ఇది మానవుల నాడీ వ్యవస్థను నిమిషాల్లోనే మూసివేసే అవకాశం ఉంది. ఏనుగును ఒక్క కాటుతో చంపేంత శక్తి వాటి విషంలో ఉందని శాస్త్రం చెబుతోంది' అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: Cockroach: వృద్ధుడి ఊపిరితిత్తుల్లో బొద్దింక.. కంగుతిన్న డాక్టర్లు!

జంతు ప్రేమికుల ఆగ్రహం..
అయితే ఈ వీడియోపై స్పందిస్తున్న స్నేక్ హ్యాండ్లర్స్ అతని తెలివిని, ధైర్యాన్ని మెచ్చుకుంటూ పొగిడేస్తున్నారు. అతని కళ్లలో భయం లేకపోవడం తమను సభ్రమాశ్చర్యాలకు గురి చేసిందంటున్నారు. జంతు ప్రేమికులు మాత్రం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగుపాము క్షేమం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ.. 'నువ్వు పట్టుకున్న తీరు నాగుపామును బాధపెడుతుందని తెలుసా? మూగ జీవుల పట్ల నైతిక విలువలు పాటించాలి. హాని చేయకూడదు. ఇది ఎంతోమంది మనోభావాలను దెబ్బతీస్తుందనే విషయం మరవొద్దు' అంటున్నారు. మరొక వ్యక్తి  మీరు దానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని నేను భావిస్తున్నా. వీడియో ప్రచారం కోసం ప్రమాదకరమైన సరీసృపాలతో ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని కోరారు.

#video-viral #king-cobra #nickthewrangler
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe