అమితా బచ్చన్ తో మమతా బెనర్జీ భేటీ... బిగ్ బీకి రాఖీ కట్టిన దీదీ....! పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిగ్ బీ అమితాబచ్చన్ ను కలిశారు. ముంబైలోని ఆయన నివాసంలో అమితాబ్ తో దీదీ భేటీ అయ్యారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ముచ్చటించారు. అనంతరం బిగ్ బీకి మమతా బెనర్జీ రాఖీ కట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను అమితాబచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. By G Ramu 30 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిగ్ బీ అమితాబచ్చన్ ను కలిశారు. ముంబైలోని ఆయన నివాసంలో అమితాబ్ తో దీదీ భేటీ అయ్యారు. బచ్చన్ కుటుంబ సభ్యులతో ఆమె కాసేపు ముచ్చటించారు. అనంతరం బిగ్ బీకి మమతా బెనర్జీ రాఖీ కట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను అమితాబచ్చన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. also read:ఇమ్రాన్ ఖాన్ కు మరోసారి షాక్…. మాజీ ప్రధాని కస్టడీని పొడిగించిన కోర్టు….! విపక్ష కూటమి ‘ఇండియా’ మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహిస్తున్నారు. అగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు మమతా బెనర్జీ ముంబైకి చేరుకున్నారు. ముంబైకి చేరుకున్న కొద్ది సేపటికే ఆమె బిగ్ బీ ఇంటికి వెళ్లారు. ఆమెకు బచ్చన్ కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. గతేడాది కోల్ కతాలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో అమితాబచ్చన్ పాల్గొన్నారు. ఆ సమావేశానికి సీఎం మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా సినిమా రంగానికి అమితాబచ్చన్ చేసిన సేవలను గుర్తించి ఆయనకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఇవ్వాలని కేంద్రాన్ని ఆమె డిమాండ్ చేశారు. also read:బిల్కీస్ భానో… మహిళా రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలి…! అమితా బచ్చన్ కుటుంబ సభ్యులతో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అమితాబ్ జీ మన భారత రత్న అని ఆమె అన్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా సినిమా రంగానికి ఎనలేని సేవలు చేశారని ఆమె కొనియాడారు. అమితాబ్ కు తాను రాఖీ కట్టానన్నారు. కోల్ కతాకు రావాలని ఆయన్ని ఆహ్వానించినట్టు మమతా బెనర్జీ వెల్లడించారు. #raksha-bandhan #india #amitabh-bachchan #mamatha-benarjee #rakhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి