Mamata Banerjee : పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) గత రాత్రి ఇంట్లో కాలు జారి పడడంతో ఆమె తలకు గాయం అయిన సంగతి తెలిసిందే. అయితే మమతా నుదుటి పై ఉన్న గాయాన్ని చూసిన వైద్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమెను వెనుక నుంచి ఎవరైనా తోసేసి ఉంటారనే సందేహాన్ని ఎస్‌ఎస్‌కేఎం మెడికల్ కాలేజీ, హాస్పిటల్ డైరెక్టర్ మణిమోయ్ అనుమానాన్ని వ్యక్త పరిచారు.
బలంగా నెట్టివేయడంతోనే ఆమెకు తీవ్ర గాయమై ఉండొచ్చని అంటున్నారు. ఆమెను రాత్రి 7.30 గంటల సమయంలో ఆసుపత్రికి తీసుకుని వచ్చారని, ఆమెను నెట్టడం వల్లే కింద పడిపోయి గాయమై ఉండొచ్చని. అందుకే తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపారు. మమతాకు న్యూరోసర్జరీ, జనరల్ మెడిసిన్ , కార్డియాలజీ విభాగాలకు చెందిన నిపుణులు చికిత్స అందించినట్లు మణిమోయ్ తెలిపారు.
ఆమెకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశామని హాస్పిటల్(Hospital) లోనే ఉండాలని చెప్పినప్పటికీ ఆమె వినకుండా ఇంటికి వెళ్లేందుకు పట్టుబట్టినట్లు తెలిపారు. అయితే ఆమెను మరోసారి ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం రావాలని తెలిపినట్లు వివరించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని తెలిపారు.
అయితే ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదు. ఈ విషయంలో మమత వాంగ్మూలాన్ని రికార్డు చేస్తారా? లేదా అనే దాని మీద స్పష్టత లేదు.
మమతా బెనర్జీ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read : రేవంత్ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తి.. అమలైన హామీలు 5!