Mallikarjun Kharge Congress: బీజేపీ ప్రభుత్వంపై నిప్పుల వర్షం కురిపించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge Congress). ఈరోజు మీడియా తో మాట్లాడిన ఆయన దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని అన్నారు. మనమందరం కలిసి దేశ భవిష్యత్తును, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, లేకుంటే మళ్లీ బానిసలుగా మారతాం అని అన్నారు. ప్రజాస్వామ్యం కాకుండా నిరంకుశత్వం, నియంతృత్వం లేకపోతే, మీరు మీ భావజాలం ఉన్న వ్యక్తిని ఎలా ఎన్నుకుంటారు? అని ప్రశ్నించారు.
నామినేషన్ వెయ్యకుండా ..
బీజేపీకి చెందిన ఏ పెద్ద నాయకుడు ఎక్కడ పోటీ చేసినా ప్రతిపక్ష పార్టీల నేతలను నామినేషన్లు వేయకుండా ఆపేస్తున్నారని అన్నారు. కాగా తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ రోజున హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత చేసిన పనిపై ఖర్గే(Mallikarjun Kharge) ఫైర్ అయ్యారు. మాధవీలతను విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. "హైదరాబాద్‌లో బీజేపీకి చెందిన ఓ మహిళా అభ్యర్థి బురఖా తొలగించి మహిళల గుర్తింపును తనిఖీ చేయడం నేను చూశాను. ఇలా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తారా...?" అని అన్నారు. ఇంత జరిగిన ఎన్నికల సంఘం ఎందుకు సరైన యాక్షన్ తీసుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ఒకపార్టీ కోసం ఎన్నికల సంఘం పనిచేస్తుందా? అని నిలదీశారు.
మాకు మోదీ వద్దు..
పూర్తయిన నాలుగు దశల ఎన్నికలలో, ఇండియా కూటమి బలమైన స్థితిలో ఉందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ప్రధాని మోదీ వద్దు అనుకుంటున్నారు అని పేర్కొననే. లోక్ సభ ఎన్నికల ఫలితాలు అంటే జూన్ 4న ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని తెలిపారు.