Malla Reddy: ఇవే నాకు చివరి ఎన్నికలు.. మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

డీకే శివకుమార్‌ను కలవడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. వ్యాపార విషయంపై డీకేను కలిసినట్లు తెలిపారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని అన్నారు. తన వయసు ఇప్పుడు 71 ఏళ్లని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తేల్చి చెప్పారు.

New Update
MLA Mallareddy: మాజీమంత్రి మల్లారెడ్డిపై కేసు

MLA Malla Reddy: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలవడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. డీకే శివకుమార్‌ని కలిసిన మాట వాస్తవమే అని అన్నారు. తన మిత్రుడుకి చెందిన యూనివర్శిటీ కొనుగోలు కోసం మాట్లాడేందుకు మాత్రమే డీకే శివకుమార్ (D. K. Shivakumar) దగ్గరకు వెళ్లినట్లు తెలిపారు. తమ మధ్య వ్యాపారానికి సంబంధించిన చర్చ జరిగిందని.. రాజకీయాలు గురించి మాట్లాడలేదని అన్నారు. ఓ మధ్యవర్తితో డీకే శివకుమార్‌ని కలిసినట్లై తేల్చి చెప్పారు.

ALSO READ: గ్రూప్-1 దరఖాస్తు గడువు పెంపు

బీఆర్ఎస్ లోనే ఉంటాను..

డీకే శివ కుమార్ ను మల్లారెడ్డి కలవడంతో ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) చేరనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చకు మరింత బలం చేకూరినట్లైంది. పార్టీ మారడంపై స్పందించారు మల్లారెడ్డి. తాను ఏ పార్టీలో చేరడం లేదని తేల్చి చెప్పారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. తాను కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ లోనే కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. తన కుటుంబం నుంచి ఎవరు రాజకీయాల్లోకి రారు అని తేల్చి చెప్పారు.

ఇక పోటీ చేయను..

తన రాజకీయ జీవితం పై మల్లారెడ్డి (Malla Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇప్పుడు 71 ఏళ్ళు అని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని కుండా బద్దలు కొట్టారు. తన వయసు రాజకీయాలు చేసేందుకు సహకరించదని.. ఇవే నాకు చివరి ఎన్నికలని అన్నారు. మరో ఐదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రజా సేవ చేయనున్నట్లు చెప్పారు. తాను పార్టీ మారడం లేదని.. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని అన్నారు.

మల్లారెడ్డికి కేసీఆర్ షాక్..

మాజీ మంత్రి మల్లారెడ్డికి షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR). తాజాగా లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో అభ్యర్థిని ప్రకటించారు. మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు (Shambipur Raju) పేరును ఖరారు చేశారు. ఈ మేరకు మల్కాజ్ గిరి ఎంపీ పోటీ నుంచి మల్లారెడ్డి కుమారుడు తప్పుకున్నారు. అయితే.. ఇటీవల మల్కాజ్ గిరి నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా తన కొడుకు భద్రారెడ్డి పోటీ చేయనున్నట్లు.. ఇందుకు కేసీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని మల్లారెడ్డి ప్రచారం చేసుకోగా తాజాగా ఆయన కొడుకు పేరును ప్రకటించకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు