Revanth vs Mallareddy: రారా చూసుకుందాం అని తొడగొట్టారు..ఇప్పుడు రేవంత్ తిక్క కుదురుస్తున్నారుగా. నోరు జారితే ఊరు జారుతుంది అని సామెత. అరే సాలే,రారా గూట్లే అంటూ తొడ గొట్టారు. దమ్ముంటే రాజకీయాల్లో గెలిచి చూపించు అంటూ రెచ్చిపోయారు మల్లారెడ్డి. ఇప్పుడు రేవంత్ తాను గెలిస్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తున్నారు. మల్లారెడ్డి vs రేవంత్ రెడ్డి ఏం జరిగిందో తెలియాలంటే ఈ కింది ఆర్టికల్ చదివేయండి. By Manogna alamuru 08 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Malla Reddy vs Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) కి, అతని అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి టీఎస్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. మొన్న మల్లారెడ్డి కాలేజీ(Malla Reddy College) లో అక్రమ కట్టడాలను కూల్చి వేసిన రేవంత్ సర్కార్.. తాజాగా మల్లారెడ్డి అల్లుడి విద్యాసంస్థల్లో అక్రమ కట్టడాల కూల్చివేస్తోంది. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన 2 శాశ్వత బిల్డింగులు, 6 తాత్కలిక షెడ్లను కలెక్టర్ ఆదేశాల మేరకు కూల్చి వేస్తున్నారు HMDA అధికారులు. 8 ఎకరాల చెరువును కబ్జా చేసి దుండిగల్ లోని MLRIT, ఏరోనాటికల్ కాలేజీల పార్కింగ్, భవనాలను MLA రాజశేఖర్ రెడ్డి నిర్మించారని గతంలో అధికారులు గుర్తించారు. దీనిపై వారం కిందట అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. తాజాగా ఆయన నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. దీనంతటికీ కారణం మల్లారెడ్డి ఎన్నికలకు ముందు విసిరిన సవాలే అంటున్నారు. మల్లారెడ్డి, రేవంత్ రెడ్డి ల మధ్య ఉన్న పగ ఇప్పటిది కాదు. ఏడేళ్ళ నుంచీ కొనసాగుతోంది. 2014 వరకు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండేవారు. అప్పుడూ కూడా ఇద్దరి మధ్యా తీవ్రమైన పోటీ ఉండేది. ఆ తరువాత మల్లారెడ్డి బీఆర్ఎస్‌లోకి, రేవంత్ కాంగ్రెస్‌లోకి వెళ్ళిపోయారు. తరువాత మల్లారెడ్డి వరుసగా గెలుస్తూ రగా..రేవంత్ ఒకసారి ఓడిపోయి, మరొకసారి గెలిచారు. అయితే రేవంత్ గెలిచింది కూడా మల్లారెడ్డి అల్లుడి మీదనే. దీంతో ఇద్దరి మధ్యా వైరం అలానే కొనసాగుతూనే ఉంది. పార్టీలు వేరైన తర్వాత మల్లారెడ్డి, రేవంత్ ఇద్దరూ ఒకరి మీద ఒకరు మాటలతో విరుచకుపడ్డారు. రేవంత్ మల్లారెడ్డిని జోకర్, బ్రోకర్ అంటూ తీవ్ర విమర్శతు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, మెడికల్ కాలేజీల కోసం భూములు కబ్జా చేశాడని.. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి అసైన్డ్ భూములను మింగేశాడంటూ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో మల్లారెడ్డి కూడా అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అరేయ్ సాలె రేవంత్ అంటూ రెచ్చిపోయారు. మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తా, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తా.. నువ్వు కూడా పీసీసీకి రాజీనామా చెయ్. ఎంపీ పదవికి రాజీనామా చేసి రా. ఇద్దరం పోటీ చేద్దాం. నువ్వు గెలిస్తే నేను రాజకీయాల నుంచే తప్పుకుంటా. నేను గెలిస్తే నువ్వు తప్పుకో. ఓడిపోయినోడు ముక్కు నేలకి రాసి సక్కగా ఇంటికెళ్లిపోదాం అంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు మల్లారెడ్డి. సాలే, గూట్లే అంటూ తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. అప్పుడే రేవంత్ మోపిన అభియోగాల సంగతి చూడండి అంటూ అధికారులను పురమాయించారు కూడా. మల్లారెడ్డి సవాలుకు గానీ, మాటలకు గానీ అప్పుడు రేవంత్ తిరిగి బదులు చెప్పలేదు. సమయం కోసం వేచి చూశారు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ గెలిచింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఇంకేముంది మల్లారెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మల్లారెడ్డి అక్రమ నిర్మాణాల మీదకు బుల్డోజర్లు వెళ్ళాయి. రోడ్డును తవ్వారు. మల్లారెడ్డి అల్లుడి భవనాన్ని కూడా కూలగొట్టారు. ఇలా మల్లారెడ్డి మాటలకు సీఎం రేవంత్ చేతలతో సమాధానం చెప్పారు. Also Read:Andhra Pradesh:ఎన్నికల వేళ జనసేనకు షాక్..ఆమంచి రాజీనామా #telangana #revanth-reddy #mallareddy #action-reation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి