Dubai:రోబోలు కూడా వదలడం లేదు..యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించిన మరమనిషి

ఆడవాళ్ళకు ఎక్కడకు వెళ్ళినా అబ్యూజింగ్ తప్పడం లేదు. చివరకు రోబోల కూడా వాళ్ళని వదిలిపెట్టడం లేదు. దుబాయ్‌లో టెక్‌ ఫెస్టివల్‌లో ఓ మగ రోబో చేసిన పనే ఇందుకు నిదర్శనం. ఇది ఆశ్చర్యపోతున్నారా...అయితే మొత్తం డీటెయిల్స్ చదివేయండి.

Dubai:రోబోలు కూడా వదలడం లేదు..యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించిన మరమనిషి
New Update

Male Robo touched Achor Back: రోబో సినిమా గుర్తుందా...శంకర్ దర్శకత్వంలో రజనీ కాంత్ యాక్ట్ చేసిన సినిమా. ఇందులో చిట్టి రోబో తెలుసు కదా. వాడు ఐశ్వర్యరాయ్‌ను ప్రేమించడమే కాకుండా..పెళ్ళి చేసుకోవాలని వేధిస్తుంటాడు కూడా. ఇప్పుడు అలాంటి రోబో గురించే చెప్పబోతున్నాం మీకు.

ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా చోట్ల ఆడ రోబోలనే తయారు చేశారు. మొట్టమొదటిసారిగా దుబాయ్‌లో జరిగిన టెక్నాలజీ ఫెస్టివల్‌లో మగ రోబోను ప్రదర్శనకు ఉంచారు. ఆడ రోబోను చేపినప్పుడు..మగ రోబోను చేయడంలో పెద్ద వింతేమీ లేదు. కానీ అది చేసిన పనే ఈ వార్త రాయడానికి కారణం అయింది. జనరల్‌గా మగవారు..ఆడవాళ్ళు ఎప్పుడు దొరుకుతారా...ఎక్కడ టచ్‌ చేద్దామా అని చూస్తుంటారు. అందరూ కాకపోయినా చాలా మంది ఇలానే ఉంటారు. దీని నుంచి తప్పించుకోవడానికి మహిళలు నానాపాట్లు పడుతుంటారు. ఇప్పుడు రోబో కూడా అదే పని చేసింది.

అసలేం జరిగిందంటే...

దుబాయ్‌లో జరిగిన టెక్నాలజీ ఫెస్ట్‌లో మహమ్మద్ అనే మగ రోబోను ప్రదర్శనకు ఉంచారు. అయితే ఈ రోబో వ్యవహరించిన తీరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ మీద అనుమానాలను రేకెత్తించింది. మహమ్మద్ అని పిలిచే ఈ హ్యుమనాయిడ్‌ గురించి రవ్యా కాస్సీమ్ అనే అమ్మాయి, రిపోర్టర్ మాట్లాడేందుకు దానికి దగ్గరగా వెళ్లింది. ఆ సమయంలో మహమ్మద్ రోబో ఆ లేడీ యాంకర్ బ్యాక్‌ను చేత్తో తాకింది. ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపోయిన రిపోర్టర్.. వారించడం కోసం అన్నట్టుగా తన చేతిని పైకెత్తి రోబో వైపు తిరిగింది. దీనికి సంబంధించిన 7 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. రోబో చేసిన పని గురించి సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఏంటీ రోబోలు కూడా ఇలా చేస్తాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఏం లేదు అపార్థం చేసుకున్నారు..

అయితే ఈ మొత్తం వ్యవహారం మీద ఆ రోబోను తయారు చేసిన క్యూఎస్ఎస్ సిస్టమ్స్ స్పందించింది. రోబో దానంతటదే పని చేస్తుందని తెలిపింది. రోబో ప్రవర్తన మామూలుగానే ఉందని చెప్పింది. అది మామూలుగానే కదిలిందని..పొరపాటున యాంకర్కు చేయి తగిలిందని క్లారిఫై చేసింది. డెమో ఇచ్చే సమయంలో జనం దానికి మరీ దగ్గరగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని చెప్పింది. రోబోకు సంబంధించిన ఫుటేజ్‌ను మొత్తం పరిశీలించామని.. రోబో ప్రవర్తనలో ఎలాంటి తేడా లేదని క్యూఎస్ఎస్ సిస్టమ్స్ వెల్లడించింది.

Also Read:Passenger Vehicles: పాసింజర్ వాహనాల అమ్మకాలు బాగా పెరిగాయి.. లెక్కలు ఇవే..

#dubai #female-anchor #male-robo #tech-festival
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe