Free bus for woman:మహిళ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన కండక్టర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసింది. దీనివల్ల జనాలు బాగానే ఉన్నారు కానీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం నానా కష్టాలు పడుతున్నారు. తాజాగా ఓ మహిళ చేసిన పనికి ఒక బస్సులోని కండక్టర్ నెత్తీనోరు కొట్టుకుని ఏడ్చాడు.

Free bus for woman:మహిళ చేసిన పనికి వెక్కి వెక్కి ఏడ్చిన కండక్టర్
New Update

మహిళ ఉచిత బస్సు ప్రయాణం తమ దుంప తెంచుతోంది అంటున్నారు కండక్టర్లు. ఎప్పుడూ లేనంతగా బస్సుల్లో 100 శాతం ఆక్సుపెన్సీ వస్తోంది. మహిళా ప్రయాణికులు ఈ పథకాన్ని విపరీతంగా వినియోగించుకుంటున్నారు. అయితే.. ఈ పథకం మహిళలకు ఎంత సౌకర్యంగా ఉందో.. అటు మగవారికి, కండక్టర్లకు అన్ని తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇటీవల ఫుట్‌బోర్డుపై ఉన్న ప్రయాణికురాలిని లోపలికి రావాలనందుకు లేడీ కండక్టర్‌ను ఇష్టమున్నట్టు దూషించింది. దాంతో.. ఆ కండక్టరమ్మ తీవ్ర మనస్థాపంతో బస్సు దిగి ఏడుస్తూ కూర్చుండిపోయింది. దీనితర్వాత మరో దగ్గర ప్రయాణికులను ఎక్కించుకున్నారని ఆటో డ్రైవర్లు...బస్సు డ్రైవర్, కండక్టర్ మీద దాడి చేశారు. ఇలాంటివి అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి.

Also Read:నేడే అయోధ్య రామయ్య విగ్రహ ఎంపిక ఓటింగ్

తాజాగా ఓ మహిళ చేసిన పనికి ఓ మగ కండక్టర్ తెగ ఏడ్చాడు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ...ఒక మహిళ తన పిల్లాడితో నాటూ బస్సు ఎక్కింది. ఆ బాబును తన లంగాలో దాచేసి కండక్టర్ దగ్గర టికెట్ తీసుకోకుండా తప్పించుకుంది. కండక్టర్ కూడా బాబను గమనించలేదు. తర్వాత కొంతసేపటికి చెకింగ్ ఆఫీసర్లు బస్సును తనిఖీ చేశారు. చెక్ చేసే క్రమంలో మహిళతో పాటు బాబు కూడా కనిపించాడు..కానీ ఆ అబ్బాయికి టికెట్ లేదు. టికెట్ ఎందుకు తీసుకోలేదంటే.. కండక్టర్ ఇవ్వలేదని ఆమె చెప్పింది. దీంతో.. ఆ కండక్టర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఎందుకు ఇవ్వలేదని కండక్టర్‌ను ఆరా తీయగా.. అతను వెక్కి వెక్కి ఏడ్వటం మొదలు పెట్టాడు. టికెట్ తీసుకోకుండా బాబును లంగాలో దాచిపెట్టిందని.. నేనేం చేయాలి అంటూ ఆఫీసర్ల ముందు ఆ కండక్టర్ బోరున ఏడ్చేశాడు. మీరంటేనే నాకు భయం అంటూ చిన్నపిల్లాడిలా గుక్కపెట్టి ఏడ్చాడు. దీంతో చేసేదేమీలేక.. ఇది మొదటిసారే కాదా..ఏమీ అనటం లేదులే నువ్వు ఏడవకంటూ కండక్టర్‌ను బుజ్జగించారు.

అయితే కండక్టర్ ఏడుపును బస్సులో ఎవరో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

#woman #telanagana #free-bus-scheam #cunductor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe