మా దేశం నుంచి మీ సైనికులను వెనక్కి పిలవండి..!

మాల్దీవుల్లో ఉన్న భారత్‌ సైనికలును వెనక్కి పిలవాలని ఆ దేశానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ముయీజూ కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ను కోరారు.

New Update
మా దేశం నుంచి మీ సైనికులను వెనక్కి పిలవండి..!

తమ దేశం నుంచి సైనికులను వెనక్కి పిలవాలని మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జూ భారత్‌ని కోరారు. శుక్రవారం నాడు నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ముయిజ్జూ ఆయన ప్రమాణా స్వీకారానికి భారత్‌ తరుఫున వెళ్లిన కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజును మర్యాద పూర్వకంగా కలిశారు.

మాల్దీవుల్లో ప్రజలు ప్రజాస్వామ్యబద్దంగా తీర్పునిచ్చారని..ఆ తీర్పును భారత్‌ గౌరవిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన కేంద్రమంత్రితో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో మాల్దీవుల నుంచి భారత్‌ సైన్యాన్ని తిరిగి పంపిస్తామని ముయీజ్జు హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రమాణాస్వీకారం చేయడంతో దీన్ని వెంటనే అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్దమైంది.

అయితే భారత మిలటరీ స్థానాన్ని మరే ఇతర దేశాల మిలిటరీతో భర్తీ చేసేది లేదని మూయీజ్జు స్పష్టం చేశారు. మాది చిన్న దేశం అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉంటామని ఆయన వివరించారు. భారత్ పేరును ఆయన ప్రస్తావించకుండా మా దేశంలో విదేశీ సైనిక కార్యకలాపాలను జరగనివ్వమని ఆయన ఓ మీడియా సంస్థతో పేర్కొన్నారు.

మాల్దీవుల్లో ఇక నుంచి విదేశీ సైనిక సిబ్బంది ఉండదని, మా భద్రత విషయానికి వస్తే నేను రెడ్‌ లైన్‌ గీసినట్లు మాల్దీవులు కూడా ఇతర దేశాల పరిధిని గౌరవిస్తుందని ఆయన వివరించారు. అయితే మాల్దీవులు హిందూ మహా సముద్రంలో కీలకమైన పొరుగుదేశం కావడంతో అక్కడ చాలా మంది భారతీయులు నివసిస్తున్నారు.

ఈ విషయం గురించి కిరణ్‌ రిజిజు ప్రస్తావించారు. దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతానికి ఎదురు చూస్తున్నామని చెప్పారు. హిందూ మహా సముద్రంలో చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో దానిని అడ్డుకోవడానికి మాల్దీవులు చాలా అవసరం. ఈ నేపథ్యంలో 70 మంది సైనికులను భారత్‌ అక్కడికి పంపింది.

దీంతో అక్కడి నుంచి రాడార్లు, నిఘా విమానాలను నిర్వహిస్తున్నది. దీంతో పాటు కొన్ని భారత యుద్ద నౌకలు కూడా గస్తీ నిర్వహిస్తున్నాయి.
హిందూ మహా సముద్రంలో ఉన్న మాల్దీవులు ఇండియాకు చాలా కీలకం. చైనా అధిపత్యాన్ని అడ్డుకోవాలంటే మాత్రం మాల్దీవులు భారత్‌ కి చాలా అవసరం.

ఇంతకు ముందు మాల్దీవులకు అధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీం సోలేహ్‌ భారత్‌ కి సన్నిహితంగా వ్యవహరించేవారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు చైనా కు సానుకూలంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Also read: మోదీ గడ్డపై తొడగొట్టేదేవరు..? ఫైనల్‌ ఫైట్‌కు సిద్ధమైన రోహిత్‌ టీమ్‌

Advertisment
తాజా కథనాలు