Maldives: మాల్దీవులు అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జు పై చేతబడి చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అక్కడి స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. పర్యావరణ శాఖలో సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, ఆమె మాజీ భర్త అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్ తో పాటు మరో ఇద్దరిని కూడా అధికారులు ఈ ఆరోపణల కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే ఇప్పటి వరకు పోలీసులు ఈ అరెస్ట్ ల గురించి బహిరంగంగా పెదవి విప్పడం లేదు. షమ్నాజ్ తో పాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేయగా..ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ ని విధింనట్లు సమాచారం.గురువారం పర్యావరణశాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు.
అలాగే రమీజ్ ను గురువారం రాత్రి మంత్రి పదవి నుంచి తప్పించినట్లు సమాచారం. గతంలో ముయిజ్జు మాలే సిటీ మేయర్ గా విధులు నిర్వహించినప్పుడు సైతం షమ్నాజ్, రమీజ్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పని చేశారు. తాజా పరిణామాలపై మాల్దీవులు ప్రభుత్వం కానీ, అధ్యక్షుడి కార్యాలయం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.