Maldives: దేశాధ్యక్షుడి పై చేతబడి..ఇద్దరు మంత్రుల అరెస్ట్! మాల్దీవులు అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జు పై చేతబడి చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, ఆమె మాజీ భర్త అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్‌ని అరెస్ట్ చేశారు. By Bhavana 28 Jun 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Maldives: మాల్దీవులు అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జు పై చేతబడి చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు అక్కడి స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. పర్యావరణ శాఖలో సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, ఆమె మాజీ భర్త అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్ తో పాటు మరో ఇద్దరిని కూడా అధికారులు ఈ ఆరోపణల కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఈ అరెస్ట్ ల గురించి బహిరంగంగా పెదవి విప్పడం లేదు. షమ్నాజ్ తో పాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేయగా..ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ ని విధింనట్లు సమాచారం.గురువారం పర్యావరణశాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. అలాగే రమీజ్ ను గురువారం రాత్రి మంత్రి పదవి నుంచి తప్పించినట్లు సమాచారం. గతంలో ముయిజ్జు మాలే సిటీ మేయర్ గా విధులు నిర్వహించినప్పుడు సైతం షమ్నాజ్, రమీజ్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పని చేశారు. తాజా పరిణామాలపై మాల్దీవులు ప్రభుత్వం కానీ, అధ్యక్షుడి కార్యాలయం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. Also read: నేడు పదవతరగతి సప్లిమెంటరీ ఫలితాలు! #black-magic #maldives #president మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి