భారతీయులకు శుభవార్త.. వీసా లేకుండా మలేషియా ట్రిప్‌!

తమ దేశ ఆర్థిక వృద్ధిని పెంచుకోవడంతో పాటు పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాడానికి మలేషియా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్‌ , చైనా నుంచి వచ్చే పర్యాటకులు వీసా లేకుండా తమ దేశంలో పర్యటించవచ్చని ఆ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ప్రకటించారు.

Visa: విద్యార్ధి వీసాల ప్రక్రియ మొదలుపెట్టిన అమెరికా..గతేడాది కంటే ఎక్కువ
New Update

విదేశాలను చుట్టి రావాలంటే కచ్చితంగా వీసా ఉండాలి. కొంతకాలం క్రితం కొన్ని దేశాలు తమ ఆర్థికాభివృద్ధిని మెరుగుపరచుకునేందుకు వీసా లేకపోయినా తమ దేశాల్లో పర్యటించేందుకు వీలు కల్పించాయి. వాటిలో థాయ్‌లాండ్‌, వియత్నాం, శ్రీలంక దేశాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలోకి మలేషియా కూడా వచ్చి చేరింది.

భారత్‌ చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోని సందర్శనకు అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం ఆదివారం నాడు ఈ విషయం గురించి తెలియజేశారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు పెట్టుబడులు పెంచాలనే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశం ఆర్థికంగా బాగుపడాలంటే ముందుగా అభివృద్ధి చెందాల్సింది పర్యాటక రంగమని మలేషియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం వివరించారు. ఇందులో భాగంగానే చైనా, భారత్‌ పౌరులకు వీసా లేకుండానే మలేషియాలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌ 1 నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

వీసా లేకుండా తమ దేశంలో 30 రోజులు పాటు ఉండవచ్చని పేర్కొన్నారు. కానీ వీసా సౌలభ్యం అనేది భద్రత ప్రక్రియకు లోబడి ఉంటుందని వివరించారు. భారత్‌ చైనా నుంచి వచ్చే పర్యాటకులు, పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు వీసా విషయంలో కొన్ని సడలింపులు కూడా ఉంటాయని గత నెలలోనే ఆ దేశ ప్రధాని ప్రకటించారు.

వీసా లేకుండా తమ దేశంలో పర్యటించేందుకు ముందుగా థాయిలాండ్‌, శ్రీలంక, వియత్నాం ప్రభుత్వాలు ఈ వెసులుబాటుని కల్పించాయి. నవంబర్‌ 10 నుంచి థాయిలాండ్‌ ఈ విధానాన్ని అమల్లోకి తీసుకుని వచ్చింది. ఇది వచ్చే ఏడాది మే 10 వరకు అందుబాటులో ఉంటుంది. అయితే పర్యాటకులు ఎక్కువ శాతం వస్తే కనుక కొనసాగింపు కూడా ఉంటుందని థాయ్‌ ప్రభుత్వం తెలిపింది.

Also read: కార్తీక మాసంలో దీపాలను నీటిలో ఎందుకు వదులుతారో తెలుసా!

#tourists #visa #malashiya
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe