Tirumala:సూర్యప్రభ వాహనం మీద ఊరేగిన మలయప్పస్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అయిన శనివారం ఉదయం …. శ్రీ మలయప్పస్వామిని సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. భక్తుల కోలాహలం మధ్యన శ్రీవారు భూదేవీ సమేత మలయప్ప స్వామిగా స్వర్ణ రథంలో ఊరేగారు.

New Update
Tirumala:సూర్యప్రభ వాహనం మీద ఊరేగిన మలయప్పస్వామి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. గురుడ సేవ తర్వాత రథోత్సవానికే ప్రాముఖ్యం ఉంటుంది. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల మంత్రోచ్ఛరణతో స్వామివారిని పూజిస్తుండగా... మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.

Also Read:వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్…తెరుచుకున్న రఫా దారులు

సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

గజవాహన సేవకు చాలా ప్రాముఖ్యత ఉంది. గొప్పవారు, రాజులకు మాత్రమే ఉండే వైభవం ఇది. అందుకే బ్రహ్మోత్సవాలుల ఈ వాహన సేవకు అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్స‌వాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.

Also Read:మెగా టోర్నీలో ఐదవ విజయం ఎవరిని వరించేనో?

ఇక ఆదివారం రాత్రి అంటే ఈరోజు స్వామివారు అశ్వవాహనం మీద ఊరేగుతారు. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యన ఈ సేవ జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో ఇదే చిట్టచివరి వాహన సేవ. అలాగే సోమవారం ఉదయం 6 నుంచి 9 గంటల మధ్యన ఉత్సవాల ముగింపుగా శ్రీవారి చక్ర స్నానం క్రతువు జరుగుతుంది. తిరుమల పుష్కరణిలో దీనిని నిర్వహిస్తారు.

Advertisment
తాజా కథనాలు