KG Jayan : సినీ ఇండస్ట్రీలో విషాదం.. ‘జయవిజయ’ సంగీత దర్శకుడు ఇకలేరు! మలయాళీ గాయకుడు, సంగీత దర్శకుడు కేజీ జయన్ (90) ఇక లేరు. ఆనారోగ్య సమస్యల కారణంగా చికిత్సపొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయ్యప్ప భక్తి గీతాలకు ఫేమస్ అయిన జయన్.. 2019లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. By srinivas 17 Apr 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Kerala : ప్రముఖ మలయాళీ సంగీత దర్శకుడు, ‘జయవిజయ’(Jaya Vijaya) పేరుతో ఎన్నో అయ్యప్ప భక్తి గీతాలను(Ayyappa Devotional Songs) ఆలపించి ప్రజాదరణ పొందిన కేజీ జయన్(KG Jayan) (90) ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్య సమస్యల(Health Problems) తో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ కేరళ(Kerala) లోని త్రిపుణితురలో ఉన్న తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే జయన్ భౌతికకాయాన్ని బుధవారం ఉదయం త్రిపుణితురలోని ఆయన స్వగృహానికి తీసుకువచ్చి, ఆ తర్వాత మృతదేహాన్ని త్రిపుణితుర పట్టణంలోని కూతంబలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి నివాళులర్పిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు త్రిపుణితుర శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పద్మశ్రీ పురస్కారం.. ఈ మేరకు దాదాపు 1000కి పైగా పాటలను రూపొందించిన ఆయన పలు మలయాళ, తమిళ చిత్రాల్లో తన గాత్రంతో అలరించారు. ఈ క్రమంలోనే 2019లో పద్మశ్రీ పురస్కారాన్ని(Padma Sri Award) అందుకున్నారు. అలాగే తన సోదరుడైన దివంగత విజయన్‌తో కలిసి కేజీ జయన్.. ‘జయవిజయ’ పేరుతో ఎన్నో అయ్యప్ప భక్తి గీతాలను ఆలపించి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. జనవరి 1989లో అజయన్ గుండెపోటుతో మరణించాడు. దీని తరువాత జయన్ వివిధ కచేరీలలో ఒంటరిగా ప్రదర్శన ఇచ్చాడు. అతను హిందూ భక్తి పాటలు ఎవర్ గ్రీన్ హిట్ ఆల్బమ్ అయిన 'మైల్‌పీలి'తో సహా వివిధ భక్తి సంగీత ఆల్బమ్‌ల కోసం వందలాది పాటలను కంపోజ్ చేశాడు. అయ్యను తునయాయ్, విష్ణుమాయయిల్ పిరన్న, మామల వాజుమ్, శ్రీకోవిల్ నాద తురన్ను, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్పా, అయ్యప్పన్ తింతకథోమ్, మలముకళిల్ వాజుం దేవా మొదలైనవి అతని ఇతర సతత హరిత స్వరకల్పనలలో కొన్ని ఉన్నాయి. ఇది కూడా చదవండి: Amitabh Bachchan: అమితాబ్ కు అరుదైన గౌరవం.. దీనానాథ్ పురష్కారం! నటుడు మనోజ్ కే జయన్ ఈయన కుమారుడు.. 2019 లో కేంద్ర ప్రభుత్వం అతనికి దేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసి జయన్‌తో ప్రత్యేక జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జయన్ మృతితో సినీ, భక్తి సంగీత రంగం ప్రముఖులలో ఒకరిని కోల్పోయిందని గాయని కెఎస్ చిత్ర అన్నారు. సంగీత దర్శకుడు శరత్ మాట్లాడుతూ జయన్ తన అభిమాన సంగీత విద్వాంసుడు అని, భక్తిగీతాలు కంపోజ్ చేయడంలో ఆయన నిష్ణాతుడని అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన సంగీత దర్శకుడు కైతప్రమ్ దామోదరన్ నంబూతిరి మాట్లాడుతూ జయన్ ఎప్పుడూ తన అభిమాన సంగీత విద్వాంసుడు అన్నారు. నటుడు మనోజ్ కే జయన్ ఈయన కుమారుడు. #passed-away #kg-jayan #jaya-vijaya #ayyappa-devotional-songs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి