Casting couch: అడ్జస్ట్‌మెంట్, కాంప్రమైజ్ అనే పదాలు మలయాళ ఇండస్ట్రీలో కామన్. ఒకసారి సినిమా ఫీల్డ్‌లోకి అడుగుపెడితే ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న అమ్మాయి అయినా కన్నుపడ్డవాడికి సర్వం సమర్పించాల్పిందే. లేదంటే ఖేల్ ఖతం. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదం దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ దుర్మార్గంపై నోరు విప్పిన నటీమణులు సమాజం నుంచి కూడా వివక్ష ఎదుర్కొన్నారు.
60ఏళ్ల నటీమణులకు తప్పని వేధింపులు..
అయితే కొంతమంది ధైర్యంగా ముందడుగు వేయగా.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ తదితర పరిశ్రమల్లో ఈ ప్రభావం తగ్గిపోయింది. కానీ మాలీవుడ్ లో మాత్రం మరింత పెరిగింది. కొత్తగా సినీ పరిశ్రమకు పరిచమైన 18 ఏళ్ల యువతితో మొదలుపెడితే 60ఏళ్ల నటీమణులకు కూడా కామాంధుల నుంచి వేధింపులు తప్పట్లేదు. స్టార్ డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్ తో మొదలుపెడితే అసిస్టెంట్ల వరకూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్లు ఇటీవల బయటపడింది. అయితే దేశవ్యాప్తంగా సంచలన రేపిన మాలీవుడ్ నటీమణుల వేధింపుల ఇష్యూ రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది.
ఇది కూడా చదవండి; Kolkata case: సుప్రీం కోర్టు ఆదేశాలో ఆందోళన విరమించిన ఎయిమ్స్ డాక్టర్లు!
ఇటీవల జస్టిస్ హేమ కమిటీ నివేదికపై స్పందించిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. స్త్రీలను ఎందుకు వేరుగా చూడాలని ప్రశ్నించారు. ఇలాంటి సమస్యలు కేవలం చట్టాలతో పరిష్కారం కావన్నారు. సామాజిక అవగాహన పెంచాలని సూచించారు. కేరళ ప్రభుత్వం సైతం జస్టిస్ హేమ కమిషన్ నివేదికపై చర్యలు తీసుకోకపోవడంతపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే మరో తరం మహిళలకు ఈ బాధలుతప్పవన్నారు. మంచి పేరు, గుర్తింపున్న మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం ఉండటం బాధకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.