cinemaa: మలైకా-అర్జున్.. ఇది ఫెవికాల్ బంధం

మలైకా అరోరా..బాలీవుడ్ హాట్ బ్యూటీ. ఈమె వయసు 49 ఏళ్లు. ఇక బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ వయసు జస్ట్ 38 ఏళ్లు. వీళ్లిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ డేటింగ్ కొనసాగిస్తున్నారు. ఇలా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ల సహజీవనంలో ఒడిగుడుగులు వచ్చాయనే ప్రచారం మొదలైంది.

New Update

మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారహో..దాదాపు వారం రోజులుగా బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని, ఎవరి బతుకులు వాళ్లు బతుకుతున్నారంటూ బాలీవుడ్ మీడియా వరుసపెట్టి కథనాలు ప్రసారం చేసింది. ఈ క్రమంలో అర్జున్ కపూర్, మరో అమ్మాయికి దగ్గరయ్యాడనే పుకార్లు కూడా మొదలయ్యాయి.

ఈ మొత్తం ఎపిసోడ్‌కు ఈ జంట ఫుల్ స్టాప్ పెట్టింది. ఆదివారం మధ్యాహ్నం ముంబయిలోని ఓ రెస్టారెంట్‌కు కలిసి వచ్చారు మలైకా-అర్జున్. ఇద్దరూ కలిసి ఎంచక్కా భోజనం చేశారు. ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. ఆ తర్వాత రెస్టారెంట్ నుంచి బయటకొచ్చి ఫొటోలకు పోజులు కూడా ఇచ్చారు. ఆ వెంటనే మలైకాతో కలిసి నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు అర్జున్ కపూర్.

ఈ ఘటనతో వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ లాంటిదేం జరగలేదనే అంశంపై క్లారిటీ వచ్చింది. వీళ్లిద్దరికీ ఫెవికాల్ కంటే గట్టి బంధం అంటూ కధనాలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారానికి మూలం ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు