Kalki 2898 AD : ప్రభాస్ 'బుజ్జి' మామూలుగా లేదుగా.. ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు..!

హీరో ప్రభాస్ ఇటీవలే ఇన్‌స్టాలో ‘కల్కి’ నుంచి బుజ్జి అనే పాత్రను రివీల్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బుజ్జి పాత్రను రివీల్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో బుజ్జి ఒక రోబో అన్నట్లుగా తెలుస్తోంది. దీనికి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.

Kalki 2898 AD :  ప్రభాస్ 'బుజ్జి' మామూలుగా లేదుగా.. ఈ సస్పెన్స్ ఏంట్రా బాబు..!
New Update

Prabhas Bujji :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కల్కీ నుంచి విడుదలైన ప్రతీ అప్డేట్ అంచనాలను మరింత పెంచేశాయి. దీనికి తోడు ఇటీవలే సినిమాలోని బుజ్జి పాత్రను ఉద్దేశిస్తూ ప్రభాస్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చేసిన తెగ వైరలైంది. త్వరలో మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారు అంటూ పోస్ట్ చేయడంతో పెళ్లి గురించి చెప్తాడేమో అని సంబరపడ్డారు ఫ్యాన్స్. కానీ చివరికి సినిమా నుంచి బుజ్జి అనే పాత్ర‌ను త్వరలోనే రివీల్ చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

బుజ్జి ఇంట్రో

అయితే తాజాగా బుజ్జి (Bujji) పాత్రకు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో బుజ్జి అంటే ఒక రోబో అన్నట్లుగా చూపించారు. ఆ చిట్టి రోబోను అందరు ముద్దుగా బుజ్జి అనే పేరుతో పిలుస్తున్నారు. ఈ రోబోకు నటి కీర్తి సురేష్ (Keerthi Suresh) వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక వీడియోలో బుజ్జి అల్లరి, మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. అయితే దీంట్లో కేవలం బుజ్జి మాటలు మాత్రమే రివీల్ చేశారు. కాగా, చివరిలో బుజ్జి ‘నా లైఫ్‌ ఎంటి? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా’ అని అంటుంది. ఇక అప్పుడు ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ‘నీ టైమ్‌ మొదలైంది బుజ్జి’ అంటూ బాడీనీ రివీల్ చేయబోతున్న సమయంలో పెద్ద సస్పెన్స్
క్రియేట్ చేశారు. బుజ్జి ఎవరో తెలుసుకోవాలంటే మే 22 వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నాగశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Prabhas: ఆ హీరోయిన్ తోనే ప్రభాస్ పెళ్లి.. ఇదిగో ప్రూఫ్..! - Rtvlive.com

#prabhas #kalki-2898-ad #bujji
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe