HI Nanna Collections: 100 కోట్లకు చేరువలో హాయ్ నాన్న.. కలెక్షన్స్ రివీల్ చేసిన మేకర్స్

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందింది . తాజాగా మేకర్స్ హయ్ నాన్న ఇయర్ ఎండ్ కలెక్షన్స్ అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లకు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు.

New Update
HI Nanna Collections: 100 కోట్లకు చేరువలో హాయ్ నాన్న.. కలెక్షన్స్ రివీల్ చేసిన మేకర్స్

Hi Nanna Collections: డైరెక్టర్ శౌర్యవ్ దర్శకత్వంలో నాని (Hero Nani), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కలిసి జంటగా నటించిన హాయ్ నాన్న చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. డిసెంబర్ 7 థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యువతను కూడా మెప్పించింది. అయితే ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి మంచి కలెక్షన్స్ రాబట్టినట్లు టాక్ వచ్చింది. కానీ మేకర్స్ ఈ విషయాన్నీ అధికారికంగా బయట పెట్టలేదు.

Also Read: Salaar Collections: క్రిస్మస్‌ రోజూ సునామీ వసూళ్లు.. రికార్డులను ఊడ్చిపడేస్తున్న ప్రభాస్‌ సలార్!

ఇక తాజాగా చిత్ర బృదం హాయ్ నాన్న(Hi Nanna)ఇయర్ ఎండ్ కలెక్షన్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. డిసెంబర్ 30 వరకు హాయ్ నాన్న ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు చేసినట్లు ప్రకటించారు. "బ్లాక్ బస్టర్ తో ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నాము. మంచి సినిమాను ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. 35 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 75 కోట్లు వసూళ్లు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. గతంలో వచ్చిన దసరా సినిమాతో 100 కోట్లుకు పైగా వసూళ్లు చేసి భారీ హిట్ కొట్టిన నాని..(Nani) ఇక ఇప్పుడు హాయ్ నాన్న తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమా.. ఓటీటీ (OTT) ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. జనవరి 4 న నెట్ ఫ్లిక్స్ లో (Netflix) స్ట్రీమింగ్ కానుంది.

Also Read: Hi Nanna OTT Release: ఓటీటీలో హాయ్ నాన్న .. రిలీజ్ డేట్ వచ్చేసింది

Advertisment
తాజా కథనాలు