RC16: రామ్ చరణ్ RC16 లో నటించే అవకాశం.. ఆడిషన్స్ జరిగేది ఇక్కడే

రామ్ చరణ్- బుచ్చిబాబు కొత్త సినిమాపై మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. కొత్త నటీనటుల కోసం ఫిబ్రవరిలో విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఆడిషన్స్ జరగనున్నాయని చెప్పారు. ఉత్సాహంగా ఉన్నవారు ఈ సినిమాలో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి అని పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
RC16:  రామ్ చరణ్ RC16 లో నటించే అవకాశం.. ఆడిషన్స్ జరిగేది ఇక్కడే

RC16: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ నటించిన భారతీయుడు చిత్రం సీక్వెల్ భారతీయుడు 2 కూడా పూర్తి చేసే పనిలో ఉండడంతో.. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కాస్త ఆలస్యంఅయ్యే అవకాశం ఉంది. ఇక ఈ గ్యాప్ లో చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా ఒకే చేశారు. గేమ్ చేంజర్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ 16 చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా  RC16 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. ఇక తాజాగా చిత్ర బృదం రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్డేట్ ప్రకారం త్వరలోనే RC16 సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

రాంచరణ్ తో కలిసి నటించే అవకాశం

publive-image

రామ్ చరణ్ 16 వ చిత్రంగా రాబోతున్న RC16 లో కొత్త నటీనటుల కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేశారు. టాలెంట్ హంట్ కోసం ఉత్తరాంధ్రకు వస్తున్నాము. ఉత్సాహం ఉన్న నటీనటులందరూ ఎంతో ప్రత్యేకంగా ఉండబోయే ఈ సినిమాలో భాగం కావడానికి సిద్ధంగా ఉండండి. ఫిబ్రవరిలో విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలలో ఆడిషన్స్ జరగనున్నాయని ట్విట్టర్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మరిన్ని వివరాల కోసం [email protected] ఈమెయిల్ ఐడీనీ సంప్రదించాలని తెలియజేశారు. రాంచరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకునే సామాన్యులకు ఇది ఒక సువర్ణ అవకాశమనే చెప్పాలి. నటీ నటుల కోసం వేట మొదలు పెట్టడంతో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వనున్నట్లు తెలుస్తుంది.

Also Read: Bigg Boss Sohel: యాంకర్ సుమ చేసిన పనికి.. ఎమోషనల్ అయిన సోహైల్

Also Read: Chiranjeevi: పద్మ విభూషణ్ చిరంజీవికి అభినందనలు తెలిపిన.. హీరో తరుణ్ ఫ్యామిలీ

Advertisment
తాజా కథనాలు