Sankranthi 2024: రేపే మకర సంక్రాంతి...ఏ సమయంలో పాలు పొంగించాలి? పండితులు ఏం చెబుతున్నారు..!! మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి 15న ఉదయం 7:15 నుంచి 12:30 వరకు ఉంది. వ్యవధి - 5 గంటల 14 నిమిషాలు. పుణ్యకాలం’ ఉదయం 7:15 గంటలకు ప్రారంభమై ఉదయం 9:15 గంటల వరకు ఉంది. ఈ సమయంలోనే పుణ్యస్నానాలు, సంక్రాంతి పూజ పాలు పొంగించాలని పండితులు చెబుతున్నారు. By Bhoomi 14 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Sankranthi 2024: సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిన రోజున మకర సంక్రాంతి(Makar Sankranti)ని జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 15వ తేదీ సోమవారం మకర సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. 2024 మకర సంక్రాంతి శుభదినం ఏది? మకర సంక్రాంతి 2024 పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుదాం. మకర సంక్రాంతి (Sankranthi)హిందువుల ముఖ్యమైన పండగ. ఈ రోజున గంగాస్నానం చేయడం, దానధర్మాలు చేయడం విశేష ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ పండుగ జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. ఈ పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలుస్తారు. అయితే, ఇతర హిందూ పండుగల మాదిరిగానే, ఈ పండుగ చంద్రుని వివిధ స్థానాలను బట్టి జరుపుకుంటారు. చాంద్రమానం కంటే సౌర క్యాలెండర్ ప్రకారం లెక్కలు జరుగుతాయి. ఈ రోజు నుండి పగలు పెరగడం, రాత్రి తగ్గడం ప్రారంభమవుతుంది. మకర సంక్రాంతి 2024(Makar Sankranti 2024) జనవరి 15, సోమవారం జరుపుకుంటారు. మకర సంక్రాంతి పుణ్యకాలం జనవరి 15న ఉదయం 7:15 నుంచి 12:30 వరకు ఉంది. మొత్తం వ్యవధి - 5 గంటల 14 నిమిషాలు. ఇక మకర సంక్రాంతి ‘మహా పుణ్యకాలం’ ఉదయం 7:15 గంటలకు ప్రారంభమై ఉదయం 9:15 గంటల వరకు ఉంది. వ్యవధి - 2 గంటలు. ఈ సమయంలోనే పుణ్యస్నానాలు పూర్తి చేసుకోవడం, సంక్రాంతి పూజ చేసుకోవడం, పాలు పొంగించుకోవడం లాంటివి చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. రామ్ రసోయిలో ..ఉచితంగా..!! మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడని వేద పండితులు చెబుతున్నారు. ఉదయం 9:13 గంటలకు సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. రేపు ఉదయం 9:14 నుంచి సూర్యాస్తమయం వరకు, ప్రజలు నదీ స్నానం చేయవచ్చు. అలాగే ఉదయం 9:20 నుంచి 10:05 వరకు ఉన్న సమయం అత్యంత శుభప్రదమైనది. ఈ ముహూర్తంలో గంగా, గోదావరి, సంగమం సహా అన్ని పుణ్యనదులలో స్నానం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది: మకర సంక్రాంతి సందర్భంగా.. పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత, తప్పనిసరిగా బెల్లం, నువ్వులు, అన్నం అవసరమైన వారికి దానం చేయాలి. దీని ద్వారా పూర్వీకుల ఆశీర్వాదం పొంది పుణ్యం లభిస్తుంది. పాపాల నుంచి విముక్తి కోసం ఈ రోజు చాలా ముఖ్యమైనదని అంటున్నారు. సంక్రాంతి అంటే నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణమంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. అయితే.. పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అని కూడా అంటారు. ఇలా ప్రతి నెల ఒక సంక్రాంతి వస్తుంది. కష్టాలు తొలగిపోతాయి: ఈ సంక్రాంతి పండగను మూడు రోజులు సంతోషంగా జరుపుకుంటారు. ఆదివారం భోగి, సోమవారం మకర సంక్రాంతి, మంగళవారం కనుమ, కొన్ని ప్రాంతాల్లో4వ రోజు బుదవారం ముక్కనుమగా చేసుకుంటారు. ఈ మూడు రోజులలో ఈ రోజు బోగిమంటలతో, రేపు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, ఎల్లుండి గో పూజలు, మాంసం ప్రియులకు మంచి కూరలతో, ఈ సంక్రాంతి పండుగ చేసుకుంటారు. #sankranti #hindu-festivals #festivals #sankranthi-2024 #sankranti-2024 #hindu-festival మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి