China Phones : చైనీస్ మొబైల్స్‌లో లోపాలు..వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేస్తున్న యాప్‌లు బైడు, హానర్, ఐఫ్లైటెక్, శామ్‌సంగ్, టెన్సెంట్, వివో, షావోమీ ఫోన్లలో లోపాలు ఉన్నాయని చెబుతోంది సిటిజెన్ ల్యాబ్. ఈ ఫోన్లలో వాడే కీబోర్డ్ యాప్‌లతో మనం టైప్ చేసేది అంతా బయటకు వెళుతోందని అంటోంది. By Manogna alamuru 25 Apr 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Keyboard Apps Security Problems : చైనా(China) లో తయారు చేయబడిన ఫోన్లు డేంజర్‌గా మారుతున్నాయని హెచ్చరిస్తోంది సిటిజెన్ ల్యాబ్(Citizen Lab). ఈ ల్యాబ్ చేసిన పరిశోధనల్లో క్లౌడ్ ఆధారిత పిన్యిన్ కీబోర్డ్ యాప్‌లు ప్రమాదకరంగా మారాయని తెలిపింది. ఈ కీబోర్డ్‌ల ద్వారా వ్యక్తిగత విషయాలు అన్నీ బహిర్గతం అవుతున్నాయని చెబుతోంది. బైడు, హానర్, ఐఫ్లైటెక్, శామ్‌సంగ్, టెన్సెంట్, వివో, షావోమీ ఫోన్లలోని తొమ్మిది యాప్‌లో లోపాలను గుర్తించామని సిటిజెన్ ల్యాబ్ చెప్పింది. ఒక్క హువాయ్ ఫోన్లలో మాత్రమే ఎటువంటి భద్రతా లోపాలు లేవని నిర్ధారించింది. కీబోర్డ్‌లలో ఉన్న లోపాల వలన మన వ్యక్తిగత సమాచారం అంతా బయటవారికి కూడా తెలిసిపోతోంది. దీని ద్వారా చాలా ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది. మన మనీ సోర్సెస్, గోప్యతా విషయాలు కూడా హ్యకర్లకు తెలిసిపోతున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని హ్యాకర్లు మన ఫోన్లు హ్యాక్ చేయడమే కాకుండా బ్యాంక్ ఇతర వివరాలను కూడా తెలుసుకునే అవకాశం ఉందని చెప్పింది సిటిజెన్ ల్యాబ్. గత ఆగస్టులో టెన్సెంట్ తాలూకా సోగౌ ఇన్‌పుట్ పద్ధతిలో క్రిప్టోగ్రాఫిక్ లోపాలను గుర్తించిన యూనివర్శిటీ ఆఫ్ టొరంటో-ఆధారిత ఇంటర్ డిసిప్లినరీ లాబొరేటరీ చేసిన ముందస్తు పరిశోధన ఆధారంగా సిటిజెన్ ల్యాబ్ ఈ ఫలితాలను బయటపెట్టింది. ఈ మొత్తం ఎఫెక్ట్ బిలియన్ వినియోగదారుల మీద ఉందని తెలిపింది. ఈ లోపాలను నివారించేందుకు పైన చెప్పిన తొమ్మిది కంపెనీ ఫోన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడమే కాక.. చైనీస్ కీబోర్డ్ యాప్(Chinese Keyboard App) లను వాడవద్దని సూచిస్తున్నారు. దీనివలన భద్రతా సమస్యలను నివారించవచ్చని చెబుతున్నారు. మన మెసేజ్‌లు ఎన్‌క్రిప్ట్ మోడ్‌లో కనిపిస్తున్నప్పటికీ అవి డీక్రిప్ట్ చేయబడుతున్నాయని తెలిపారు. హానర్, టెన్సెంట్ (QQ పిన్యిన్) మినహా ప్రతి కీబోర్డ్ యాప్ డెవలపర్ ఏప్రిల్ 1, 2024 నాటికి సమస్యలను పరిష్కరించారని చెప్పారు. బైడు వి3.1 ఎన్‌క్రిప్షన్ ప్రోటోకాల్‌లోని బగ్ కారణంగా విండోస్‌లో టైప్ చేసిన దాన్ని పూర్తిగా ఇతరులు ఎవరైనా సంగ్రహించవచ్చును. అలాగే ఐఫ్లైటెక్‌లో కూడా ఆండ్రాయిడ్ యాప్ నెట్‌వర్క్ ఈవ్‌డ్రాపర్‌లను తగినంతగా ఎన్‌క్రిప్ట్ చేయని కారణంగా మెసేజ్‌లు అందరికీ బహిర్గం అయిపోతున్నాయి. ఆండ్రాయిడ్‌లో శామ్సంగ్ కీ బోర్డ్ ది సాదా, ఎన్‌క్రిప్ట్ చేయని HTTP ద్వారా కీస్ట్రోక్ డేటాను ప్రసారం చేస్తుంది. Xiaomi, ఇది Baidu, iFlytek మరియు Sogou నుండి కీబోర్డ్ యాప్‌లతో ముందే ఇన్‌స్టాల్ చేయబడి వస్తుంది దీనివల్లనే ఈ ఫోన్లలో వ్యక్తిగత వివరాలు బయటకు రావడానికి అవకాశం ఏర్పడుతోంది. ఓప్పో, బైడు, సోగోలలో చైనీస్ కీబోర్డ్ యాప్‌లు ముందే ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయి. వీవో కూడా ఇదే పద్దతిలో ఉంది. అందుకే ఈ ఫోన్లలో అస్సలు సెక్యూరిటీ లేదని చెప్పింది. Also Read:IPL 2024: హైదరాబాద్‌లో ఐపీఎల్ హంగామా..స్టేడియం దగ్గర కాంగ్రెస్ గొడవ #phones #security #chinese #keyboard-apps మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి