Accident : హైవే పై ఘోర ప్రమాదం..కారు,ట్రక్కు ఢీకొని 8 మంది దహనం!

బరేలీలోని భోజిపురా హైవే పై పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న కారు డంపర్‌ ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనం అయ్యారు.

New Update
Accident : హైవే పై ఘోర ప్రమాదం..కారు,ట్రక్కు ఢీకొని 8 మంది దహనం!

Road Accident : బరేలీ(Bareilly) లోని భోజిపురా హైవే పై శనివారం రాత్రి ఘోర ప్రమాదం (Road accident) జరిగింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దగ్దం కావడంతో పాటు 8 మంది సజీవ దహనం అయ్యారు. రాత్రి 11 గంటల సమయంలో డంపర్‌, కారు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ మంటల్లో రెండు వాహనాలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదం నుంచి డంపర్‌ వాహన డ్రైవర్‌ ప్రాణాపాయం నుంచి బయటపడగా..ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు(Burnt alive). వీరిలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసు అధికారులు వివరించారు. శనివారం రాత్రి 11 గంటలకు బరేలీ నుంచి బహెడి వైపు నైనిటాల్‌ హైవే పై ఎర్టిగా కారు వెళ్తుంది.

హైవే పై భోజిపురా సమీపంలో ఓ వాహనం అదుపు తప్పి డివైడర్‌ ను దాటి అవతలి వైపునకు దూసుకువచ్చింది. ఈ క్రమంలోనే మరోపక్క నుంచి అతి వేగంగా దూసుకు వస్తున్న డంపర్‌ ను కారు ఢీకొట్టింది. దీంతో డంపర్‌ కి కారుకు మంటలు అంటుకున్నాయి.కారు డంపర్‌ లో ఇరుక్కుపోయి దాదాఉ 100 మీటర్ల మేర ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కారులో ఉన్నవారికి కిందకి దిగే అవకాశం లేకుండా పోయింది. సెవన్‌ సీటర్ ఎర్టిగా కారులో ప్రయాణిస్తున్న వారంతా మంటల్లో కాలిపోయారు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చనిపోయిన వారి సంఖ్య 8 అని పోలీసులు చెబుతున్నారు. కారు నంబర్‌ ఆధారంగా కారును బహేరీలోని రాంలీలా మొహల్లాలో నివాసం ఉంటున్న సుమిత్‌ గుప్తాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. వివాహ వేడుకకు వెళ్లేందుకు కారును బుక్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది.

పోలీసులు , అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసి కారులోపల చూడగా కేవలం అస్థిపంజరాలు మాత్రమే మిగిలాయని అధికారులు వెల్లడించారు.

Also read: రాజస్థాన్‌ సీఎం ఎవరు..ఎటూ తేల్చుకోలేక తలలు పట్టుకున్న కమలనాథులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు