/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-17-1-jpg.webp)
Mahesh Babu AI as DJ Tillu: సూపర్ స్టార్ మహేష్ బాబు డీజే టిల్లుగా మారిపోయాడు. అదే డ్రెస్సు, అదే లుక్ లో అదిరిపోయాడు. అంతేకాదు రాధిక ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ టిల్లుగాడి పంచు డైలాగులతో అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా నెటిజన్లు షాక్ అవుతున్నారు.
View this post on Instagram
అసలు విషయాకొస్తే ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ (AI) సపోర్టుతో హీరో మహేష్ బాబును (Mahesh Babu) పూర్తిగా డిజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ లుక్ లో మార్చేశారు. డీజే టిల్లు సినిమాలో సిద్దూ రాధికా అపార్ట్ మెంట్ కు వెళ్లే సీన్ ను మహేష్ బాబుతో ఎడిట్ చేశారు. సిద్దూ ముఖానికి బదులు మహేష్ బాబు ఫేస్ ను ఎడిట్ చేసి అలాగే ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి మహేష్ బాబు వాయిస్ ను కూడా సెట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఫ్యాన్స్, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
View this post on Instagram