Mahesh Babu : సుకుమార్ కు మహేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. వైరల్ అవుతున్న కామెంట్స్

'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ లో దర్శకుడు పైడిపల్లి వంశీ తనకోసం రెండేళ్లు ఎదురుచూశారని, అన్ని సంవత్సరాలు ఎవరూ ఎదురు చూడరన్నారు. దాంతో సుకుమార్ ను ఉద్దేశించే మహేష్ ఆ కామెంట్స్ చేశాడని టాక్ నడిచింది.

New Update
Mahesh Babu : సుకుమార్ కు మహేష్ బాబు స్ట్రాంగ్ కౌంటర్.. వైరల్ అవుతున్న కామెంట్స్

Mahesh Babu : సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన 'పుష్ప' మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు చేయాల్సింది. 'వన్ నేనొక్కడినే'తర్వాత సుకుమార్.. మహేష్ కు 'పుష్ప' స్క్రిప్ట్ వినిపించాడు. సినిమాలో డీగ్లామర్ గా తాను నటిస్తే అభిమానులు చూడటం కష్టమవుతుందనే ఉద్దేశంతో మహేష్ బాబుదాన్ని తిరస్కరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

నిజానికి 'పుష్ప' స్క్రిప్ట్ లో కొన్ని మహేష్ కొన్ని మార్పులు చెప్పి, కొద్ది నెలల టైం అడిగారట. దానికి తోడు మహేష్ ఆ టైం లో వేరే సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత చేద్దామని సుకుమార్ తో అన్నారు. అయితే అంతవరకు ఆగడం ఇష్టంలేని సుకుమార్ అల్లు అర్జున్ తో దీన్ని తెరకెక్కించారు. అయితే మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు.

Also Read : ఆ డైరెక్టర్ లైంగిక వాంఛలకు నేను బలి.. ప్రముఖ నటి సంచలన ఆరోపణలు

ఈ సినిమా దర్శకుడు పైడిపల్లి వంశీ తనకోసం రెండు సంవత్సరాలు ఎదురుచూశారని, అన్ని సంవత్సరాలు ఎవరూ ఎదురు చూడరన్నారు. దాంతో సుకుమార్ ను ఉద్దేశించే మహేష్ ఆ కామెంట్స్ చేశాడని సోషల్ మీడియా అంతా కోడై కూసింది. దానిపై మహేష్ ఓ మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు.

తాను సుకుమార్ ను అలా అన్నట్లుగా వార్తలు వచ్చాయని, అతను నాకు మిత్రుడని, అందులో ఎటువంటి సందేహం అవసరంలేదని, త్వరలోనే ఆయనతో కలిసి పనిచేస్తానని దీన్నివేరే విధంగా ఎవరూ భావించవద్దని మహేష్ బాబు గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరలవుతున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు