Mahesh Babu: గుంటూరు కారం కోసం..జిమ్‌ లో ప్రిన్స్‌!

జిమ్‌ చేయడం మహేష్‌ కు ముందు నుంచి ఉన్న అలవాటు. అందుకే, ఎప్పుడూ సేమ్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా వర్కవుట్ చేస్తున్న ఫోటోలను మహేష్ పోస్ట్ చేశారు.

New Update
Mahesh Babu: గుంటూరు కారం కోసం..జిమ్‌ లో ప్రిన్స్‌!

Mahesh Babu: టాలీవుడ్‌ రాజకుమారుడు మహేష్‌ బాబు అంటే పడి చచ్చిపోయే వారు చాలా మంది ఉన్నారు. వయసు పెరుగుతున్న కానీ మహేష్‌ అందం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ చాలా మంది ఆడ పిల్లలకు మహేష్‌ అంటే కలల రాకుమారుడే అని చెప్పవచ్చు. ఆయన అందం చూస్తే మాకు అసూయ అంటూ చాలా మంది హీరో హీరోయిన్లు సరదాగా చెప్పిన వాళ్లు ఉన్నారు.

మహేష్‌ డైట్ పక్కాగా ఫాలో అవుతారు. తిండి విషయంలో ఆయనకు చాలా లిమిట్స్‌ ఉన్నాయి. అంతే కాకుండా క్రమం తప్పకుండా జిమ్‌ చేయడం మహేష్‌ కు ముందు నుంచి ఉన్న అలవాటు. అందుకే, ఎప్పుడూ సేమ్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా వర్కవుట్ చేస్తున్న ఫోటోలను మహేష్ (Mahesh Babu) పోస్ట్ చేశారు.

ఇప్పుడు మహేష్ బాబు ఆర్మ్స్ ఎక్స్‌ర్‌సైజ్స్ చేస్తున్నారు. ఆయన పోస్ట్ చేస్తే ఫోటోను బైసెప్స్ బాగా కనపడుతున్నాయి. బహుశా... 'గుంటూరు కారం' (Guntur Kaaram) ఫైట్స్ కోసం ఆయన కష్ట పడుతున్నట్లు తెలుస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram) తో మహేష్‌ కు ఇది మూడో చిత్రం. అతడు, ఖలేజా వంటి మంచి చిత్రాలను అందించిన గురూజీ మరి ఈసారి కూడా హిట్‌ ఇస్తాడనే అభిమానులు ఎదురు చూస్తున్నారు.

'గుంటూరు కారం'. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. గురువారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి అంతా సిద్ధం అయ్యింది. మరుసటి రోజు నుంచి మహేష్‌ కూడా షూటింగ్‌ కి వస్తారని సమాచారం.

గుంటూరు కారం'లో మహేష్ సరసన యువ కథానాయికలు శ్రీ లీల (Sree Leela), మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు.ఇప్పుడు కొత్తగా మారింది ఏమైనా ఉందంటే... అది 'గుంటూరు కారం' విడుదల తేదీ.

ముందు ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లు తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఒక్క రోజు ముందుకు వచ్చారు. జనవరి 12న విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Also Read: మెగా ఫ్యాన్స్‌కు అదిరే ట్రీట్‌.. ‘క్లింకార’ ఫస్ట్‌ లుక్‌..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు