Mahesh Babu: న్యూయార్క్ వీధుల్లో కూతురు సితారతో సూపర్ స్టార్..! మహేష్ బాబు లుక్ అదిరింది

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి న్యూ యార్క్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నమ్రత, మహేష్ తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మహేష్ బాబు తన కూతురు సితారతో కలిసి న్యూయార్క్ వీధుల్లో దిగిన ఓ క్యూట్ ఫొటోను పంచుకున్నారు.

New Update
Mahesh Babu: న్యూయార్క్ వీధుల్లో కూతురు సితారతో సూపర్ స్టార్..! మహేష్ బాబు లుక్ అదిరింది

Mahesh Babu: ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ రెండింటీనీ సమానంగా బ్యాలెన్స్ చేసుకునే చాలా మంది హీరోల్లో మహేష్ బాబు ఒకరు. ఎల్లప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే మహేష్ సంవత్సరంలో కనీసం రెండు సార్లైనా ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తుంటారు. షూటింగ్ నుంచి కాస్త టైం దొరికిన ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు.  అయితే తాజాగా సూపర్ స్టార్ తన కుటుంబంతో కలిసి న్యూ యార్క్ ట్రిప్ వెళ్ళాడు. న్యూ యార్క్ వీధుల్లో కూతురు సితారతో , భార్య నమ్రతతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నమ్రత, మహేష్ బాబు తమ ఇన్ స్టాలో షేర్ చేశారు. మహేష్ బాబు న్యూ యార్క్ వీధుల్లో తన కూతురు సితారతో కలిసి దిగిన క్యూట్ ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటోల్లో మహేష్ బాబు రాజమౌళితో చేయబోయే SSMB 29 అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

SSMB 29 

RRR తర్వాత రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. SSMB 29 గా రూపొందనున్న ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్లు తెలుస్తోంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ తో సెట్స్ పైకి కూడా వెళ్లనున్నట్లు సమాచారం. ఇక షూటింగ్ మొదలయ్యే గ్యాప్ లో మహేష్ బాబు తన కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే న్యూ యార్క్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read: NBK Golden Jubilee: యాక్షన్ కింగ్.. డైలాగ్ కింగ్.. మై లవ్లీ బ్రదర్ బాలయ్య.. రజినీకాంత్ స్పెషల్ ట్వీట్ - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు