Mahesh Babu: కొంతకాలం ముందు వరకు సినిమాలు చూడలంటే కచ్చితంగా థియేటర్లకు వెళ్లాల్సి వచ్చేది. అవి కూడా సింగిల్ తెర థియేటర్లే. మల్టీప్లెక్స్ థియేటర్లు అంటే పెద్ద పెద్ద మెట్రో సిటీల్లో మాత్రమే ఉండేవి. అందులో ఏసీ, రెండు మూడు తెరలు ఉండే సరికి వాటిని చూడటానికే ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
దీంతో సింగిల్ థియేటర్లు యజమానులు కూడా తమ థియేటర్లను మల్టీప్లేక్స్ లుగా మార్చుతున్నారు. మల్టీప్లెక్స్ లు ఎక్కువ అయిన తరువాత మెయింటైన్స్ లు తట్టుకోలేక చాలా సింగిల్ తెర థియేటర్లు మూతపడ్డాయి.
ఇక హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోకి ఆర్టీసీ క్రాస్ రోడ్డు (RTC X Roads) లోని ప్రతి శుక్రవారం సినీ అభిమానులకు పండగే. అక్కడ ఉన్న దేవి, సుదర్శన్, సంధ్య థియేటర్స్ అయితే హీరోల కటౌట్ లు, బ్యానర్లు, పూలదండలతో ఖాళీ లేకుండా ఉంటాయి.
అలాంటి ఆ ఏరియాలో చాలా కాలంగా మూతపడిన ఓ థియేటర్ ను మహేష్ బాబు (Mahesh Babu) మల్టీప్లెక్స్ గా మార్చాలని చూస్తున్నట్లు టాక్.ఈ విషయం తెలిసిన అభిమానులకు పండగే. ఈ ప్రాంతంలో గతంలో ఈ ప్రాంతంలో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఒకటి ఉండేది.
దానిని 2010 లో మూసి వేశారు. ఇప్పుడు ఆ థియేటర్ ను మహేష్ లీజుకు తీసుకుని దానిని ఏషియన్ సినిమాస్ తో కలిసి ఏఎంబీ క్లాసిక్ అనే కొత్త పేరుతో 7 స్క్రీన్లు ఉండే విధంగా ఓ పెద్ద మల్లీప్లెక్స్ కట్టబోతున్నారని సమాచారం.
అయితే దీని గురించి ఇంకా మహేష్ ఏ విషయం తెలియజేయలేదు. దీని గురించి పూర్తి సమచారం రావాలంటే మాత్రం ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.
Also read: మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు..ఇంకెందుకు ఆలస్యం!