/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-31T152054.323.jpg)
Mahesh Babu Emotional Post On Super Star Kirshna's 81st Birth Anniversary : తెలుగు సినిమాకి హాలీవుడ్ టచ్ ఇచ్చిన లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి నేడు. ఈ సందర్భంగా ఓ వైపు అభిమానులు మరోవైపు సినీ ప్రముఖులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో మహేష్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ప్రతీ క్షణం మిస్ అవుతున్నా...
మహేష్ బాబు తన పోస్ట్ లో.. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మిమ్మల్ని ప్రతి క్షణం మిస్ అవుతున్నాను. నా ప్రతి జ్ఞాపకంలోనూ మీరు ఎప్పటికీ జీవించే ఉంటారు’ అంటూ కృష్ణ యంగ్ లుక్‌లో ఉన్నప్పటి ఫొటోను పంచుకున్నారు. కాగా హీరో సుధీర్ బాబు సైతం కృష్ణను తలుచుకుంటూ పోస్ట్ పెట్టాడు.
Also Read : బాలయ్యను దారుణంగా తిట్టిన బాలీవుడ్ డైరెక్టర్.. సంస్కారం లేని వాడంటూ!
" హ్యాపీ బర్త్‌డే మామయ్య. మీ పక్కన కూర్చొని ‘హరోం హర’ చూడాలనుంది. నేను ఇలాంటి యాక్షన్ సినిమాలో నటించాలని మీరు ఎప్పుడూ ప్రోత్సహించేవారు. ఈ సినిమా మీకోసమే చేశాను. మీరు గర్వపడేలా చేస్తానని హామీ ఇస్తున్నాను" అని పేర్కొన్నాడు.
View this post on Instagram