Mahesh Babu : అంబానీ వివాహ వేడుకలో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌!

ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ వివాహం వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌ నుంచి సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.

New Update
Mahesh Babu : అంబానీ వివాహ వేడుకలో టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌!

Ambani Wedding Ceremony : ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన ముఖేష్‌ అంబానీ (Mukesh Ambani) చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani), ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె రాధికా మర్చంట్‌ (Radhika Merchant) వివాహ వేడుక శుక్రవారం ఉదయం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ఈ తారల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితార ఆ వేడుకలో పాల్గొన్న ఫొటో ఇది. ఈ ఫొటోల్లో మహేష్‌ స్టైలిష్‌ లుక్‌ లో కనిపించి అభిమానులకు కనువిందు చేస్తున్నాడు.

Also read: అంబానీ ఇంటి చిన్న కోడలిగా రాధికా..తొలి ఫోటో నెట్టింట వైరల్‌!

Advertisment
తాజా కథనాలు