/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-73-1.jpg)
Mahesh Babu And Family Attends Anant Ambani's Marriage : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్ ల వివాహం మహోత్సవం నేడు (జూలై 12న) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అతిథులుగా రానున్నారు. ఇప్పటికే పలువురు బడా పారిశ్రామిక వేత్తలు, సహాలీవుడ్ తారలు కిమ్ కర్దాషియన్, ఖ్లో కర్దాషియన్, ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులు ముంబై చేరుకున్నారు.
కాగా మన టాలీవుడ్ తరఫున ఒక్క రామ్ చరణ్ కు మాత్రమే ఈ పెళ్ళికి ఆహ్వానం అందినట్లు మొదట వార్తలు వచ్చాయి. నిన్నే చరణ్ తన ఫ్యామిలీతో ముంబై చేరుకోగా.. నేడు మరో టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు బయలుదేరాడు. ఈరోజు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలకు సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబంతో సహా హాజరుకానున్నారు.
Superstar Mahesh sets off to Mumbai to attend the Grand Wedding of Ananth Ambani..@urstrulyMahesh #AmbaniWedding #Mumbai #RTV pic.twitter.com/DAPJaFRIih
— RTV (@RTVnewsnetwork) July 12, 2024
Also Read : లావణ్య డెడ్ బాడీని మాయం చేస్తా.. మాల్వీ మల్హోత్రా సంచలన వార్నింగ్?
న్యూ లుక్ అదిరిపోయింది...
ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో మహేష్ న్యూలుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. లేటెస్ట్ లుక్ లో మహేష్ అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా లాంగ్ హెయిర్, గడ్డంతో అచ్చం హాలీవుడ్ రేంజ్ హీరోలా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలను మహేష్ ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.
Superstar @UrstrulyMahesh sets off to Mumbai to attend the Grand Wedding of Ananth Ambani ❤️🔥#MaheshBabu #SSMB pic.twitter.com/cPmPxTLrjL
— Mahesh Babu Space (@SSMBSpace) July 12, 2024