Mahasena Rajesh: మహాసేన రాజేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పార్టీ పెద్దలతో చర్చించిన తర్వాత.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వదిలి వెళ్లొద్దని పార్టీ పెద్దలు సూచించినట్లు రాజేష్ తెలిపారు. మా వర్గాల రక్షణ బాధ్యత టీడీపీ తీసుకుంటుందని.. ఆందోళన అవసరం లేదని చెప్పారు. దీనిపై టీడీపీ నుంచి కూడా బహిరంగ ప్రకటన వస్తుందని తెలిపారు. అయితే ఇటీవల మహాసేన రాజేష్.. టీడీపీ రాజీనామా చేయాలనుకున్నారు.
Also Read: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు అరెస్టు..
స్వతంత్రంగా 100 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో మహాసేన ఈ ప్రకటన చేయడంతో.. టీడీపీ అధిష్ఠానం అప్రమత్తమైంది. రాజేష్‌తో టీడీపీ పెద్దలు సంప్రదింపులు జరిపారు. చివరికి రాజేష్.. టీడీపీలో ఉంటానని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తు్న్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. మే 13న ఏపీలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: వైసీపీకి మరో బిగ్ షాక్..మరో ఎమ్మెల్యే జంప్