మహారాష్ట్రలో 144 సెక్షన్‌..ఇంటర్నెట్ కూడా బంద్‌!

మహారాష్ట్రలో మరాఠా ఉద్యమం కోసం గత కొన్ని రోజులుగా ఉద్యమం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు అధికారులు 144 సెక్షన్‌ ను అమలు చేయడంతో పాటు..ఇంటర్నెట్‌ సేవలను కూడా బంద్‌ చేశారు.

మహారాష్ట్రలో 144 సెక్షన్‌..ఇంటర్నెట్ కూడా బంద్‌!
New Update

మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా సాగుతున్న ఈ ఉద్యమం గత వారం నుంచి ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్‌ జరంగే నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఉద్యమం కోసం ఇప్పటికే చాలామంది యువత తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే మనోజ్‌ ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. దీంతో ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఉద్యమకారులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Also read: చంద్రబాబు రూట్ మ్యాప్ ఇదే..ఆయన ఎలా వెళ్లనున్నారంటే!

మనోజ్ పరిస్థితిని చూసి కూడా సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో ఉద్యమకారులు ఎమ్మెల్యేల నివాసాలకు , కార్యాలయాలకు, దుకాణాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధికారులు మంగళవారం రాష్ట్రంలో 144 సెక్షన్‌ విధించారు.

ఇంటర్నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు. సుమారు 32 సంవత్సరాల క్రితం మరాఠా రిజర్వేషన్ల పై తొలిసారి ఉద్యమం మొదలైంది. అప్పట్లో ఈ ఉద్యమానికి మత్తడి లేబర్‌ యూనియన్‌ నాయకుడు నాయకత్వం వహించారు. అయితే తాజాగా మనోజ్‌ నేతృత్వంలో ఈ ఉద్యమం మళ్లీ మొదలయ్యింది.

ఈయన జాల్నాలో నిరాహార దీక్షకు కూర్చున్నారు. కాగా బీడ్ జిల్లాలో నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దీనితో బీడ్ ఉద్యమానికి కేంద్రంగా మారింది.

#maharashtra #144-section #internet-bandh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe