Pune: మహారాష్ట్రలోని (Maharashtra) పూణె (Pune) లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. పూణె జిల్లాలోని తహసీల్దార్ (Thahasildar) కార్యాలయంలో ఈవీఎం (EVM) పరికరాలు చోరీకి గురయ్యాయి. రెవెన్యూ అధికారి కార్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పరికరం, కొన్ని స్టేషనరీలను దొంగిలించారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయ అధికారులు మంగళవారం పోలీసులు సమాచారం అందించారు.
సీసీటీవీ లో రికార్డు..!
ఈ చోరీ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాస్వాడ్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఓ అధికారి తెలిపారు.
పుణె రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ, “ఈవీఎం యంత్రం పరికరాలు, కొన్ని కాగితాల కట్టలు దొంగిలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో ప్రమేయమున్న ముగ్గురిని పట్టుకునేందుకు బృందాలను రంగంలోకి దించారు.
ఈ మేరకు సస్వాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Also read: నితీష్ కుమార్ వెళ్లిపోయారు, మరికొంత మంది వెళ్తారు..ఉద్దవ్ ఠాక్రే!