Maharashtra news: డ్రీమ్ 11లో కోటిన్నర గెలుచుకున్న సీఐ... షాక్ ఇచ్చిన అధికారులు

కోటీన్నర గెలిచి సంబరాల్లో మునిగిపోతున్న సోమనాథ్‌కు డిపార్ట్‌మెంట్‌ షాక్‌ ఇచ్చింది. బెట్టింగ్ యాప్‌ ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఆటల వల్ల కొంతమంది ప్రాణాలు పోతుంటే.. మరి కొంతమంది కోటీశ్వరులు అవుతున్నారు.

New Update
Maharashtra news: డ్రీమ్ 11లో కోటిన్నర గెలుచుకున్న సీఐ... షాక్ ఇచ్చిన అధికారులు

ప్రజలు తప్పు చేస్తే పోలీసులు భయం చెప్పాల్సింది పోయి.. వారే తప్పటడుగులు వేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మోసాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బెట్టింగ్ యాప్ ద్వారా ఓ ఎస్‌ఐ కోటీశ్వరుడు కావటంనేతో కొత్త సమస్య మొదలైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన పోలీస్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సోమనాథ్‌ డ్రీమ్‌ 11లో పందెం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైయ్యారు. అతన్ని అదృష్టవంతుడంటూ కొన్ని రోజులగా ఒకటే వార్తలు వచ్చాయి. మహారాష్ట్రలోని పింప్రి చించ్‌వాడ్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు చెందిన సోమనాథ్‌ ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. ప్రపంచ కప్‌లో భాగంగా.. ఇంగ్లాండ్‌-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సోమనాథ్‌ బెట్టింగ్‌ వేశాడు. ఈ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎంపిక చేసిన జట్టు ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలవడంతో సోమనాథ్‌కు రూ.కోటీన్నర జాక్‌పాట్‌ తలిగింది.

3 నెలలుగా అదృష్టానికి పరీక్ష

నిబంధనలను అతిక్రమించి.. పోలీస్‌శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ సోమనాథ్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఏసీపీ సతీష్ మానే ప్రకటించారు. చించ్‌వాడ్‌ పోలీస్‌ కమిషనరేటులో పనిచేసే సోమనాథ్‌ అక్టోబరు 10న విధుల్లో ఉండి మరీ ఇంగ్లాండ్‌ - బంగ్లాదేశ్‌ మ్యాచ్‌పై బెట్టింగ్‌లో పాల్గొని నిబంధనలు అతిక్రమించారు.అంతేకాకుండా బెట్టింగ్‌లో పాల్గొనడమే కాకుండా విధులను నిర్లక్ష్యం చేశారని చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. సోమనాథ్‌ కేసుపై తదుపరి విచారణ బాధ్యతలను డీసీపీకి అప్పగించారు. డబ్బులు గెలుచుకున్న సంతోషంలో ఉబ్బితబ్బియిపోతున్న ఆతనికి ఉన్నతాధికారుల చర్యలతో ఒక్కసారిగా సంతోషం ఆవిరైంది. సోమనాథ్ చించ్‌వాడ్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్నాడు. డ్రీమ్ 11లో పాల్గొని  3 నెలలుగా సోమనాథ్‌ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

గొప్పగా, ఓపెన్‌గా

భారత్‌ వేదికగా ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్‌-బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతున్న..ఈ మ్యాచ్‌లో ఉత్తమంగా ఆడిన ప్లేయర్లతోనే సోమనాథ్‌ టీమ్‌ను ఎంపిక చేసుకున్నాడు. అయితే.. అతను కొన్ని నెలలుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాని..ఇప్పుడు అదృష్టం కలిసి వచ్చిందని తెలిపారు. వచ్చిన మొత్తం డబ్బుతో సగం డబ్బుతో ఇంటి రుణం తీరుస్తానని తెలిపారు. మిగతా సగం డబ్బును భవిష్యత్‌ అవసరాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని తెలిపారు. దాని ద్వారా వచ్చే వడ్డీ డబ్బులు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని సోమనాథ్‌ చెప్పారు. డ్రీమ్‌ 11లో రూ.కోటీన్నర గెలిచిన విషయాన్ని గొప్పగా, ఓపెన్‌గా సోమనాథ్‌ చెప్పుకున్నాడు. ఇదీ కాస్తా.. పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ ఆన్‌లైన్ గేమ్‌లో పాల్గొనవచ్చా..?  ఇలా ఎన్నో ప్రశ్నలు సోషల్‌ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ కేసుపై డీసీపీ పూర్తిగా విచారించిన అనంతరం నివేదిక ఆధారంగా సోమనాథ్‌ను సస్పెండ్‌ చేశారు.

ఇది కూడా చదవండి: అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఆటకట్టించిన పోలీసులు..భారీగా బంగారం స్వాధీనం

Advertisment
Advertisment
తాజా కథనాలు