MLA RK: జగన్‌ను తిట్టమన్నారు... ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు!

తిరిగి వైసీపీలో చేరిన MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌ను తిట్టమని కాంగ్రెస్ తనను ఆదేశించినట్లు పేర్కొన్నారు. జగన్ తనను రెండు సార్లు ఎమ్మెల్యే చేశారన్నారు. జగన్‌ను తిట్టడం తనకు ఇష్టంలేక తిరిగి వైసీపీలో చేరినట్లు తెలిపారు.

New Update
MLA RK: జగన్‌ను తిట్టమన్నారు... ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు!

MLA Alla Ramakrishna Reddy: మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ (AP Assembly Elections) ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు హైటెక్కుతున్నాయి. తాజాగా తిరిగి వైసీపీ లో (YCP) చేరి ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మంగళగిరి (Mangalagiri) ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy). ఇటీవల వైఎస్ షర్మిల (YS Sharmila) తోనే నా ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైసీపీ లో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ లో చేరిన అనంతరం ఆళ్ల ఆర్టీవీతో మాట్లాడారు.

ALSO READ: పరువునష్టం కేసులో రాహుల్‌ గాంధీకి ఊరట..

అందుకే రాజీనామా చేశా...

తిరిగి వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ను తిట్టమని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిందని అన్నారు. సీఎం జగన్ ను తిట్టమనడం తనకు నచ్చలేదని తెలిపారు. సీఎం జగన్ (CM Jagan) తనను రెండు సార్లు ఎమ్మెల్యే చేశాడని కొనియాడారు. ఏపీ కాంగ్రెస్ పార్టీలో (AP Congress) పద్దతి పాడు ఏమి లేదని విమర్శించారు. రాజకీయాల్లో రాజకీయం గురించి మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ.. షర్మిల విధానం అలా లేదు.. కేవలం వ్యక్తిగతంగానే ఉంటుందని ఆరోపణలు చేశారు. ఈ విషయం పై ఎన్నోసార్లు షర్మిల తో పాటు పార్టీకి చెప్పి చూశానని.. అయినా వారు పట్టించుకోలేదని అన్నారు. సీఎం జగన్ పై వ్యక్తిగతంగా వెళ్లడం తనకు నచ్చలేదని.. అందుకే షర్మిల తో నడవడం ఇష్టం లేక సొంత గూటికి వచ్చినట్లు తెలిపారు.

జగన్ ఇచ్చిన బాధ్యత..

ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైసీపీ లో చేరడంపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్కే కు మంగళగిరి గెలుపు బాధ్యతలు ఇచ్చారు. అయితే మరోవైపు ఆర్కేకు సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉందనిఆ పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకుంది. ఇప్పటికే సీఎం జగన్ ఆర్కేకు ఎమ్మెల్యే టికెట్ హామీ కూడా ఇచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. సొంత గూటికి వచ్చిన ఆర్కేకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందో లేదో మరికొన్ని రోజుల్లో తెలియనుంది.

DO WATCH:

Advertisment
తాజా కథనాలు