Telangana Elections: నేనూ సీఎం అభ్యర్థినే.. మనసులోని మాట చెప్పేసిన మధుయాష్కి..

New Update
Telangana Elections: నేనూ సీఎం అభ్యర్థినే.. మనసులోని మాట చెప్పేసిన మధుయాష్కి..

Madhu Yashki Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం క్యాండిడేట్స్ లిస్ట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ లిస్ట్‌లో తాజాగా మధుయాష్కి కూడా వచ్చి చేరారు. తానెందుకు సీఎం క్యాండిడేట్ కాదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ జాతీయ న్యూస్ ఛానెల్ నిర్వహించిన డిబేట్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడి ఆయన.. సీఎం పోస్టులో తన మనసులోని మాటను చెప్పేశారు. తానెందుకు సీఎం అవ్వొద్దని అన్నారు.

యాంకర్ మాట్లాడుతూ.. 'ఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీలో మాత్రం చాలా మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. ఇంతకీ మీ సీఎం అభ్యర్థి ఎవరు? రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి నేతలు చాలా మంది ఉన్నారు. మరి మీలో ఎవరు సీఎం?' అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన మధు యాష్కి.. తానెందుకు సీఎం కాకూడదన్నారు.

ఆ కారణంగానే అన్నారా?

తానెందుకు సీఎం కాకూడదు అంటూ మధుయాష్కి తన మనసులోని మాటను వెలిబుచ్చడం వెనుక కారణం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీసీ నినాదం గట్టిగా వినిపిస్తోంది. బీజేపీ ఇప్పటికే బీసీ సీఎం అంటూ ప్రకటించింది. కాంగ్రెస్‌లో కూడా బీసీ వాదం గట్టిగానే వినిపిస్తోంది. సీట్ల కేటాయింపు విషయంలోనే బీసీ వాదాన్ని బలంగా వినిపించారు ఆ వర్గం నేతలు. ఈ క్రమంలో తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. పార్టీ అధిష్టానం బీసీని ముఖ్యమంత్రిని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ ముఖ్యమంత్రి కాకపోయినా.. ఉపముఖ్యమంత్రి గానీ, కీలక మంత్రి పదవి గానీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకే.. మధుయాష్కి గౌడ్ నిజామాబాద్‌ను వీడి ఎల్బీనగర్‌కు వచ్చారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు.

Also Read:

తెలంగాణలో 80 శాతం కాంట్రాక్టులు మెఘాకే.. వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు..

తెలంగాణలో కీలక నేతల ఆస్తులు.. వారిపై ఉన్న కేసులు ఇవే..

Advertisment
తాజా కథనాలు