AP News: సీఐడీ చేతికి మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు!

ఏపీలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్దం కేసు సీఐడీకి అప్పగించినట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పలువురు ఉద్యోగులు, నాయకులపై 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

AP News: సీఐడీ చేతికి మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసు!
New Update

Madanapalle: ఏపీలోని మదనపల్లే సబ్ కలెక్టర్ ఫైల్స్ దగ్దం కేసు సీఐడీకి అప్పగించినట్లు డీజీపీ ద్వారాక తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై ఇప్పటివరకూ పలువురు ఉద్యోగులు, నాయకులపై 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జూన్ 21న రాత్రి ఫైల్స్ దగ్గం చేసిన నేరస్థులకు శిక్షపడేలా చేస్తామన్నారు.

అయితే ఇది అగ్నిప్రమాదం కాదని.. ఉద్దేశ్యపూర్వకంగానే కీలక దస్త్రాల్ని కాల్చివేశారని పోలీసులు తేల్చారు.. దీనిపై విచారణ సాగుతూ వస్తున్న తరుణంలో.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా సమీక్షలు నిర్వహించారు.. సీఎం ఆదేశాలతో డీజీపీ సహా కీలక అధికారులు రంగంలోకి దిగారు.

అలాగే తెలంగాణలో నేరాల నివారణపై డీజీపీ జితేందర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఇక నుంచి మరింత కఠినంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డయల్ 100 రెస్పాన్స్ సమయాన్ని మెరుగుపర్చాలని, మహిళలు, చిన్నారులపై నేరాలను అరికట్టాలని సూచించారు. శాంతి భద్రతల విషయంతో నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నేరస్థులను ఉపేక్షించే పరిస్థితి లేదని, న్యాయస్థానాల్లో వారికి శిక్షపడేలా తెలంగాణ పోలీసులు కృషి చేస్తున్నారని డీజీపీ జితేందర్‌ పేర్కొన్నారు. బాధితులకు, ముఖ్యంగా వారిలో మహిళలు, పిల్లలకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు.

#madanapalle #dgp-tirumala-rao #sub-collector-rate-files
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe