తెలంగాణకు ఐటీ మంత్రి ఆయనే.. కేటీఆర్ కంటే డైనమిక్ అంటున్న నెటిజన్లు తెలంగాణలో కొత్త ఐటీ మంత్రి ఎవరనే దానిపై నెట్టింట బిగ్ డిబేట్ నడుస్తుంది. ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు ఐటీ మంత్రి అయితే బాగుంటుందని నెటిజన్లు సూచిస్తున్నారు. ఆయన కేటీఆర్ కంటే డైనమిక్ లీడర్, కేటీఆర్ స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేస్తాడంటున్నారు. By srinivas 06 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana IT Minister In 2023 : తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ (Congress)మంత్రివర్గంపై పెద్ద ఎత్తు్న చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా మంగళవారం ముఖ్యమంత్రిపై క్లారిటీ రాగా తదుపరి శాఖలకు ఎవరెవరూ బాధ్యత వహించబోతున్నరనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అయితే ముఖ్యంగా ఐటీ మంత్రి ఎవరనే దానిపై సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ నడుస్తుండగా తాజాగా ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు (Madan Mohan Rao)ఐటీ మంత్రిగా న్యాయం చేస్తారంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. Madan Mohan Kalakuntla MBA from The Wharton School Founder & Chairman of USM Business System Self made Billionaire MLA(INC) of Yellareddy A potential Candidate for the IT Minister so Pinkis stop Nonsense. Congress Party More Capable & Educated Politicians.#RevanthForTelanganaCM pic.twitter.com/TrNI7D6bzz — Prakash g (@gprakash_17) December 5, 2023 ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండుసార్లు కేటీఆర్ ఐటీ మంత్రిగా పని చేయగా తన సమర్థతవంతమైన పనితీరుతో ఆ శాఖ రూపు రేఖలే మార్చేశారనడంలో సందేహ లేదు. యువత ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యాపారవేత్తలుగా ఎదగాలని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 'టి-హబ్' అనే వేదికకు అంకురార్పణ చేశారు. ఇది పూర్తిగా కేటీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిందే. ఏడేళ్లు తిరిగే సరికి 'టి-హబ్' ప్రపంచ స్థాయి స్టార్టప్‌లకు వేదికగా మారింది. ఐటీని హైదరాబాద్‌కు మాత్రమే పరమితం చేయకుండా రాష్ట్రంలోని టూ టైర్ నగరాలకు కూడా విస్తరించారు. ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్‌లో తమ కార్యక్రమాలుగా ఏర్పాటు చేసేలే కేటీఆర్ చొరవ తీసుకున్నారు. దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేలా చేశారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత చాలా మంది సోషల్ మీడియాలో కేటీఆర్‌కు మద్దతుగా పోస్టులు పెట్టారు. కేటీఆర్ లాంటి డైనమిక్ ఐటీ మినిస్టర్ దొరకరని చెప్పారు. Also read :వరుణ్-లావణ్యలకు విడాకులేనా.. మరో చిచ్చుపెట్టిన వేణుస్వామి ఈ క్రమంలోనే తాజాగా నెటిజన్ల ప్రశ్నలకు తాజాగా కాంగ్రెస్ మద్దతుదారులు ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్‌కు సరితూగే సమర్థవంతమైన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారని చెబుతున్నారు. ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావు పేరును ఐటీ మంత్రిగా వారు సూచిస్తున్నారు. మదన్ మోహన్ రావు ది వార్టన్ స్కూల్ నుండి MBA పూర్తి చేశాడని, USM బిజినెస్ సిస్టమ్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్‌గా కూడా వ్యవహరించాడని చెబుతున్నారు. ఐటీ మంత్రి మంత్రిత్వశాఖకు ఆయన సరైన వ్యక్తని సూచిస్తున్నారు. మదన్ ఉన్నత విద్యావంతుడని, కమ్యూనికేషన్స్ స్కిల్స్ దండిగా ఉన్నాయని కేటీఆర్ స్థానాన్ని కచ్చితంగా భర్తీ చేస్తాడని అంటున్నారు. ఆయన ఉన్నత విద్యావతుండని.. స్పా్ర్క్ ఉందని కచ్చితంగా కేటీఆర్‌లాగే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చే సత్తా ఉందని అంటున్నారు. ఏదీ ఏమైనా రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మిగతా శాఖలపై క్లారిటీ రానుంది. #telangana #congress-party #it-minister #madan-mohan-rao #telangana-it-minister-in-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి