Shanthi-Madan: నా కుటుంబానికి న్యాయం చెయ్యండి.. హోంమంత్రికి మదన్ మోహన్ కంప్లైంట్!

తన భార్య శాంతి కడుపునపుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ భర్త మదన్ మోహన్ ఏపీ హోం మంత్రి అనితను కలిశారు. 'నా కుటుంబానికి న్యాయం చెయ్యండి. నాకు, నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది. మాకు రక్షణ కల్పించండి' అంటూ హోంమంత్రితోపాటు డీజీపీని కోరారు.

New Update
Shanthi-Madan: నా కుటుంబానికి న్యాయం చెయ్యండి.. హోంమంత్రికి మదన్ మోహన్ కంప్లైంట్!

Madan mohan: ఏపీకి చెందిన శాంతి, మదన్ మోహన్, సుభాష్, విజయసాయిరెడ్డిలకు సంబంధించిన ఇల్లీగల్ రిలేషన్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతోంది. శాంతికి పుట్టిన పిల్లలకు తండ్రి ఎవరనే అంశం హాట్ టాపిక్ గా మారగా ఇప్పటికే మీడియా సమావేశంలో శాంతి పలు ఆధారాలతో మొదటి బిడ్డలు మదన్ మోహన్, తర్వాత సుభాష్ కు జన్మించారని చెప్పింది. అయితే దీనిని మదన్ మోహన్, సుభాష్ ఖండించడంతో మరింత రచ్చ మొదలైంది. అయితే తాజాగా తన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ మదన్ మోహన్ ఏపీ హోం మంత్రి అనితను కలిశారు.

ఈ మేరకు పలు ఆధారాలతో వినతి పంత్రం అందించిన మదన్ మోహన్.. 'నా బిడ్డకు తండ్రెవరో తేల్చండి. నా కుటుంబానికి న్యాయం చెయ్యండి. నా బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉంది. నా ప్రాణాలకు ప్రమాదం ఉంది. రక్షణ కల్పించండి' అంటూ హోంమంత్రి అనితను కలిసి కంప్లైంట్ చేశారు. అలాగే తనకు ప్రాణ రక్షణ కల్పించాలంటూ డీజీపీని సైతం కోరారు మదన్ మోహన్. అంతటితో ఆగకుండా తన బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డే అంటూ ఆరోపిస్తున్నారు. కానీ శాంతి మాత్రం తన బిడ్డకు తండ్రి సుభాష్ అని వాదిస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు