Paytm: పేటీఎంకు ఘోర అవమానం..ఏం జరిగిదంటే..!!

పేటీఎం షేర్లలో పతనం కొనసాగుతూనే ఉంది. మంగళవారం మరింత క్షీణించాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మీద ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా ఈ సంస్థ పీకల్లోతు ఇబ్బందుల్లోకి ఉంది. విదేశీ బ్రోకరేజ్ సంస్థ మాక్వారీ రేటింగ్ కారణంగా మంగళవారం పేటీఎం స్టాక్ 10 పాయింట్లు పడిపోయింది.

New Update
Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు మరో భారీ షాక్...రూ. 5.49కోట్ల జరిమానా.!
Paytm Shares : ఫారిన్ బ్రోకింగ్ హౌస్ మాక్వారీ, పేటీఎం షేర్ల రేటింగ్ ను డౌన్ గ్రేడ్ చేయడంతో... పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ (One 97 Communications) లిమిటెడ్‌కు 'అండర్ పెర్ఫార్మ్' రేటింగ్ ఇచ్చింది. అంతేకాదు ఈ స్టాక్ (Paytm Stocks) టార్గెట్ ధరను కూడా రూ. 275కి తగ్గించింది. ఇంతకుముందు పేటీఎం షేర్లకు రూ. 650 టార్గెట్ ధరను ఈ బ్రోకింగ్ కంపెనీ ఇచ్చింది. ఇప్పుడు కొత్త రేటింగ్ ప్రకారం చూసినట్లయితే లక్ష్యిత ధరను ఒకేసారి 57శాతం కొనేసి ఘోరంగా అవమానించింది. పేటీఎం షేర్లను మాక్వారీ డౌన్ గ్రేడ్ చేయడంతోపాటు ఆర్బీఐ గవర్నర్ సోమవారం చేసిన వ్యాఖ్యలు కూడా పేటీఎం ఇన్వెస్టర్లను భయపెట్టాయి.

ఈ రెండు వార్తలు బయటకు వచ్చాక మంగళవారం ఉదయం మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పేటీఎం షేర్లు రెడ్ జోన్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ స్టాక్ ఈరోజు రూ. 380 దగ్గర కనిష్టస్థాయికి చేరుకుంది. మాక్వారీ ఇచ్చిన టార్గెట్ ప్రైస్ మంగళవారం కనిష్ట స్థాయి కంటే దాదాపు రూ. 100 తక్కువగా నమోదు అయ్యింది. అంటే బ్రోకరేజ్ ప్రకారం పేటీఎం షేర్ కు ఇప్పుడున్న విలువ కూడా ఎక్కువే. మాక్వారీ లెక్క ప్రకారం ఈ స్టాక్ ఇంకా రూ. 100తగ్గాల్సి ఉంటుంది. అదే జరిగితే ఇన్వెస్టర్ల పెట్టుబడి (Investments) దాదాపుగా జీరో అవుతుంది.

ఈ ఏడాది జనవరి 31న ఆర్బీఐ (RBI) ఆంక్షలు విధించిన నాటి నుంచి ఇప్పటి వరకు పేటీఎం (Paytm) కౌంటర్ సుమారు 45శాతం నష్టపోయింది. 2021 నవంబర్ 18న జీవిత కాల గరిష్టస్థాయి రూ. 1995 మార్క్ ను టచ్ చేసింది మంగళవారం నాటికి రూ. 380కి పడిపోయింది. ఇది లైప్ టైమ్ గరిష్టస్థాయి కంటే 80.55 శాతం ఎక్కువ. 2023 అక్టోబర్ లో 52వారాల గరిష్టస్థాయి రూ. 998.30కి చేరిన తర్వాత కూడా నిరంతరం పతనవుతూ వస్తుంది. ఐపీవో సమయంలో ఒక్కో షేర్ ను రూ. 2,150 చొప్పున పేటీఎం విడుదల చేసింది. అయితే ఇష్యూ ధర కంటే డిస్కౌంట్ లో రూ. 1,950 దగ్గర ఈ స్క్రిప్ స్టాక్ మార్కెట్లో (Stock Market) లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ తర్వాత కొద్దిగా పెరిగాయి. హయ్యర్ వాల్యూయేషన్ కారణంగా ఈ కంపెనీ షఏర్లు నష్టాల్లోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం ఐపీఓ మార్కును అందుకోలేనంత దూరంలోకి వెళ్లాయి.

Advertisment
తాజా కథనాలు