Pinnelli Brothers : అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు?

ఎన్నికల తరువాత ఏపీలో పల్నాడులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.

Pinnelli Brothers : అజ్ఞాతంలోకి పిన్నెల్లి సోదరులు?
New Update

Ap Politics : ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు(Elections) ముగిసిన తరువాత అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పల్నాడులో తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఆ జిల్లాలో 144 సెక్షన్‌ కూడా విధించారు. ఎలక్షన్‌ కమిషన్‌(Election Commission) కూడా ఈ వ్యవహారం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీకి పిలిపించి వివరణ కూడా తీసుకుంది.

పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. తాజాగా అల్లర్ల నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది.

వారిద్దరూ గన్‌మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి పిన్నెల్లి గన్‌మెన్లు తమ ఉన్నతాధికారులకు ఈ విషయం గురించి తెలిపారు. కారంపూడి అల్లర్ల నేపథ్యంలో, అరెస్టులు తప్పవన్న ఉద్దేశంతోనే వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. వారు విశ్రాంతి కోసం హైదరాబాద్‌ వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు పేర్కొన్నారు.

Also read: రోడ్డు మీద సీపీఆర్‌ చేసి ఆరేళ్ల బాలుడ్ని కాపాడిన వైద్యురాలు!

#pinnelli-ramakrishna-reddy #palnadu #politics #gunturu #macharla
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe