Devara : 'దేవర' మూడో పాట.. పాటకు మించిన ఆట, భీభత్సమే.. అంచనాలు పెంచేసిన లిరిసిస్ట్

ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఎక్స్ వేదికగా 'దేవర' మూడో సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చారు.' మూడో పాట నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని, అందులో తారక్ డ్యాన్స్ ఇరగదీశాడని, సాంగ్ ఎప్పుడొచ్చినా భీభత్సమే' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కాస్త సాంగ్ పై అంచనాలు పెంచేశాయి.

Devara : 'దేవర' మూడో పాట.. పాటకు మించిన ఆట, భీభత్సమే.. అంచనాలు పెంచేసిన లిరిసిస్ట్
New Update

Devara Third Single Update : జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర' సెప్టెంబర్ 27 న థియేటర్స్ లో సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా ఫియర్, చుట్టమల్లే వంటి సాంగ్స్ అయితే ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

చుట్టమల్లే సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా నుంచి మూడో పాట కోసం మ్యూజిక్ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా దేవర మూడో సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చారు.

Also Read : ప్రభాస్ తెలుగు హీరోనే కాదు.. కోలీవుడ్ స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

" మూడో పాట పాటకు మించిన ఆట.. కన్నుల పండగ.. ఒక ఆట ఆడుకున్నాడట తారకరాముడు.. ఎప్పుడని అడక్కండి. ఎప్పుడొచ్చినా భీభత్సమే పక్కా.. ఈ ఆల్బమ్ వేరే లెవెల్ అంతే " అంటూ ట్వీట్ చేయడంతో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

#ramajogaiahsastry #devara-third-single
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి