/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-11-2.jpg)
Indian Army New Chief: భారత ఆర్మీకి కొత్త ఛీఫ్ ఎన్నికయ్యారు. ప్రస్తుత ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా ఉన్న ఉపేంద్ర ద్వివేది జులై 1 నుంచి భారత సైన్యాన్ని నడిపించనున్నారు. ఇండియన్ ఆర్మీ కొత్త చీఫ్‌గా ఈయన నియమితులయ్యారు. ఈనెల 30న ఉపేంద్ర ప్రస్తుత ఆర్మీ చీఫ్ మనోజ్ సి పాండే నుంచి బాధ్యతలను స్వీకరించనున్నారు. మనోజ్ సి పాండే ఆర్మీ నుంచి రిటైర్ అవనున్నారు. ఉపేంద్ర పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం మెడల్స్‌ను పొందారు.
1964లో జన్మించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది డిసెంబర్ 15, 1984న భారత సైన్యంలోని పదాతిదళ రెజిమెంట్ అయిన జమ్మూ & కాశ్మీర్ రైఫిల్స్‌లో నియమితులయ్యారు. తన 40 సంవత్సరాల సేవలో ఈయన అనేక రకాల పాత్రలను నిర్వహించారు.ఈయన కమాండ్ నియామకాలలో కమాండ్ ఆఫ్ రెజిమెంట్ (18 జమ్మూ & కాశ్మీర్ రైఫిల్స్), బ్రిగేడ్ (26 సెక్టార్ అస్సాం రైఫిల్స్), డిఐజి, అస్సాం రైఫిల్స్ (తూర్పు) ఇంకా 9 కార్ప్స్ ఉన్నాయి. ఇక లెఫ్టినెంట్ ఉపేంద్ర దీనికన్నా ముందు 2022 నుండి 2024 వరకు నార్తర్న్ కమాండ్‌కు డైరెక్టర్ జనరల్ ఇన్‌ఫాంట్రీ, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌తో సహా ముఖ్యమైన పదవులను నిర్వహించారు.
లెఫ్టినెంట్ ఉపేంద్ర ద్వివేది రేవా సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ కాలేజ్, US ఆర్మీ వార్ కాలేజీల్లో చదివారు. దాని తరువాత DSSC వెల్లింగ్టన్, ఆర్మీ వార్ కాలేజ్, మోవ్‌లో కూడా కోర్సులు చేశారు. ఈయన కార్లిస్లేలోని US ఆర్మీ వార్ కాలేజీలో గౌరవనీయమైన NDC సమానమైన కోర్సులో 'డిస్టింగ్విష్డ్ ఫెలో' పొందారు.
Also Read:T20 World Cup: కెనడాపై అతి కష్టం మీద గెలిచిన పాకిస్తాన్